Mathew Thomas : రోడ్డు ప్రమాదంలో గాయపడిన లియో నటుడి కుటుంబం… ఒకరు మృతి

Mathew Thomas : ప్రముఖ మలయాళ నటుడు మాథ్యూ థామస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మాథ్యూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గాయపడగా, ఒకరు మరణించరన్న వార్త మాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది.

ప్రమాదం ఎలా జరిగిందంటే ?

మాథ్యూ థామస్, అతని కుటుంబం మే 15 న తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సమాచారం ప్రకారం అతని కుటుంబం ప్రయాణిస్తున్న కారు కేరళలోని ఎర్నాకులంలోని సస్తాముగల్ వద్ద అదుపు తప్పి కాలువలో పడిపోయింది. కారును నడుపుతున్న మాథ్యూ సోదరుడు జాన్‌ కు గాయాలయ్యాయి. అయితే వాళ్ళ బంధువు బీనా డేనియల్ తీవ్ర గాయాల కారణంగా మరణించింది.

ఒకరు మృతి..

మాథ్యూ ఫ్యామిలీ ఓ వేడుకలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు సమాచారం. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ మాథ్యూ బంధువు ప్రాణాలను డాక్టర్లు కాపాడలేకపోయారు. ఆమె పేరు బీనా అని తెలుస్తోంది. బీనాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఆసుపత్రిలోనే మరణించింది. ఆమె వయస్సు 61 సంవత్సరాలు. రిటైర్డ్ టీచర్ అని తెలిసింది. మాథ్యూ తండ్రి, బిజు, అతని తల్లి, సుసన్, బీనా భర్త సాజు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆసుయపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

ప్రమాదంపై పోలీసుల విచారణ

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై వారి కారు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకరమైన ప్రమాదం మాథ్యూ థామస్ ను, అతని కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో మాథ్యూ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మాథ్యూ థామస్ సినిమాలు

మాథ్యూ థామస్ ఫహద్ ఫాసిల్ ‘కుంబళంగి నైట్స్’తో సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. ‘తన్నీర్ మథన్ దినంగల్’, ‘అంజాం పతిరా’, ‘ఆపరేషన్ జావా’, ‘లియో’,  ‘జో అండ్ జో’ వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో కనిపించాడు. రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు’లో కూడా కనిపించాడు.

ఇదిలా ఉంటే మాథ్యూ థామస్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం కప్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 21న మేకర్స్ టీజర్‌ను విడుదల చేసారు. టిజర్ ప్రేక్షకులలో భారీ హైప్‌ ని క్రియేట్ చేసింది. టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. కప్‌ మూవీని అనన్య ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆల్విన్ ఆంటోనీ, ఏంజెలీనా మేరీ నిర్మించారు. దీనికి సంజూ వి శామ్యూల్‌ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. కప్ బ్యాడ్మింటన్ ఆట చుట్టూ తిరిగే మూవీ. షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇందులో మాథ్యూ థామస్ తండ్రి బాబుగా గురు సోమసుందరం, తల్లిగా తుషార పిళ్లై, అతని సోదరిగా మృణాళిని సుసాన్ జార్జ్ కనిపిస్తారు. నమిత ప్రమోద్, కార్తీక్ విష్ణుతో పాటు బాసిల్ జోసెఫ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, రియా శిబు కూడా నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు