MathewThomas & Naslen: మలయాళం యంగ్ హీరోలు ఇద్దరు తమిళ్ డెబ్యూ ఇచ్చారు

MathewThomas & Naslen: ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ అంతా కూడా భాష తో సంబంధం లేకుండా సినిమాలు చూడటం మొదలుపెట్టారు. ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా దానిని ఆదరించడం అలవాటుగా మారింది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలన్నీ కూడా ఓటీటీలో చూడటం మొదలుపెట్టారు. కొన్ని మలయాళం సినిమాలు థియేటర్లో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే వాటికి కూడా తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మలయాళం లో హిట్ అయిన సినిమాను తెలుగులో డబ్బింగ్ రూపంలో కూడా అందించడానికి చాలామంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రీసెంట్ గా ప్రేమలు అనే సినిమాని రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ రూపంలో అందించాడు.

Thala Ajith's Good Bad Ugly

ప్రస్తుతం అన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రిలీజ్ కావడం వలన మిగతా భాషల్లో నటులు కూడా ఆయా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. చాలామంది తెలుగు దర్శకులు చేసే సినిమాలలో మలయాళం నటులు, తెలుగు నటులు కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే ఇద్దరు యంగ్ మలయాళం నటులు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన లియో సినిమాలో ఒక కీలకపాత్రలో మ్యాత్యు థామస్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లియో సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీనికి కారణం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా రావడం. దీనికంటే ముందు లోకేష్ చేసిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అంతకు మించిన అంచనాలతో ఆడియన్స్ థియేటర్ కి వెళ్లారు కానీ ఈ సినిమా కొద్దిపాటి నిరాశను మిగిల్చింది అనేది వాస్తవం.

- Advertisement -

ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ హీరోగా నటిస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఈ సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.చాలావరకు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరగనుంది. ప్రస్తుతం కూడా సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలోకి యువ హీరో అడుగుపెట్టడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెరిగాయి. ప్రేమలు సినిమాతో హిట్ అందుకున్న నస్లెన్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ రకంగా ఇద్దరూ మలయాళం యంగ్ హీరోస్ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో డెబ్యూ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు