Mathu Vadalara 2: రిలీజ్ కి సిద్ధమైన మత్తు వదలరా సీక్వెల్..!

Mathu Vadalara 2.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా సీక్వెల్ పర్వమే కొనసాగుతూ ఉన్నది. మొదటి భాగం హిట్ కాగానే ఆ సినిమాకి సీక్వెల్ ని సైతం మేకర్స్ ప్రకటిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు సీక్వెల్ సినిమా రావడానికి కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. అలా ఎం.ఎం కీరవాణి కొడుకు సింహ కోడూరి హీరోగా నటించిన మత్తు వదలరా సినిమా విడుదలై 2019లో మంచి విజయాన్ని అందుకుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. బాగా ఆకట్టుకుంది. అయితే ఇందులో నరేష్ అగస్త్య, సత్య అతుల్య, చంద్ర కీలకమైన పాత్రలో నటించారు. ఏ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో తాజాగా ఈ సినిమా సీక్వెల్ ని సైతం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mathu Vadalara 2: Mathu Vadalara sequel ready for release..!
Mathu Vadalara 2: Mathu Vadalara sequel ready for release..!

సెప్టెంబర్ 13న మత్తు వదలరా 2..

క్లాత్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ వారు మత్తు వదలరా-2 చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారట. ఇందులో ఫరియా అబ్దుల్లా, సునీల్ , వెన్నెల కిషోర్, అజయ్ రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి తదితర నటీనటులు నటిస్తున్నారు. డైరెక్టర్ రితేష్ రానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తూ ఉండడం గమనార్హం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రెండు పోస్టర్ల ద్వారా ఒక విచిత్రమైన ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నామంటూ సీక్వెల్ ని ప్రకటించారు. ఇకపోతే సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నట్లు తాజాగా ఒక పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్ చూస్తుంటేనే.. సీక్వెల్ మొదటి భాగానికి మించి ఉండేటట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా శ్రీ సింహ కి ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.

శ్రీ సింహ కెరియర్..

ఇక శ్రీ సింహ విషయానికి వస్తే… ఈయన పూర్తి పేరు శ్రీ సింహ కోడూరి . 2007లో వచ్చిన యమదొంగ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగు పెట్టారు. 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై , 1996 ఫిబ్రవరి 23న హైదరాబాదులో జన్మించారు. ఈయన ఎవరో కాదు ఎంఎం కీరవాణి తనయుడే. ఈయన తల్లి శ్రీవల్లి. అంతేకాదు ప్రముఖ గాయకుడు ఆస్కార్ వేదికపై తన గాలాపన చేసి ప్రేక్షకులను మెప్పించిన సినీ గాయకుడు కాలభైరవ సోదరుడే.

- Advertisement -

ఇకపోతే శ్రీ సింహ సినిమాల విషయానికొస్తే.. 2007లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలో బాలనటుడిగా నటించిన శ్రీ సింహ, సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో సమంత స్నేహితుడిగా నటించాడు. అలాగే 2018 లో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఇక 2021 లో మార్చ్ 27న మణికాంత దర్శకత్వం వహించిన శ్రీ సింహ హీరోగా నటించిన తెల్లవారితే గురువారం చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత భాగ్ సాలె సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పుడు త్వరలో మత్తు వదలరా సినిమాతో సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు