Mathu Vadalara2 : సెన్సార్ పనులు ముగించుకున్న మత్తు వదలరా2.. ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్..

Mathu Vadalara2 : టాలెంటెడ్ హీరో శ్రీ సింహ (Sri Simha) – కమెడియన్ సత్య పాత్రల్లో తెరకెక్కిన కామెడీ సినిమా “మత్తు వదలరా”. ఐదేళ్ల కింద వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా “మత్తు వదలరా2” (Mathu Vadalara2) తెరకెక్కుతోందని తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ వస్తుందని చాలా నెలల నుండే చిత్ర యూనిట్ చెప్పుకురాగా, నెల కిందట ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేయగా నెట్టింట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. ఫస్ట్ పార్ట్ దర్శకుడు రితేష్ రానాయే (Ritesh Rana) సెకండ్ పార్ట్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన మత్తు వదలరా2 మూవీ మేకర్స్ నుండి తాజాగా సెన్సార్ అప్డేట్ వచ్చింది.

Mathu Vadalara 2 movie got U/A Censor certificate

సెన్సార్ పనులు ముగించుకున్న మత్తువదలరా2..

ఇక మత్తు వదలరా2 సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేయగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుందని చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. మత్తు వదలరా2 సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ని ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ని మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా తెలియచేసారు. ఇదిలా ఉండగా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ లో ఉండగా, కొన్ని రోజుల కిందటే మేకర్స్ “మత్తువదలరా2” సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసారు.

- Advertisement -

డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ..

ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినపుడు చిత్ర యూనిట్ మత్తు వదలరా2 సినిమాతో ఫస్ట్ పార్ట్ (Mathu Vadalara) ని మించి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే మేకర్స్ సరికొత్త ప్రమోషన్లతో సినిమాపై అంచనాలను పెంచేయగా, తాజాగా ఫరియా అబ్దుల్లా (Faria Abdulla) స్వయంగా సినిమా కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ పాడి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ వారు సంయక్తంగా తెరకెక్కించిన మత్తు వదలరా2 సినిమాను రితేష్ రానా దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. మరి థియేటర్లలో ఈసారి మూవీ లవర్స్ ని ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు