Mathu Vadalara 2 Trailer : మత్తు వదలరా 2 ట్రైలర్ వచ్చేసింది.. కామెడితో నవ్వించేసారుగా..

Mathu Vadalara 2 Trailer : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ( Keeravani ) చిన్నకొడుకు శ్రీసింహ ( Sri Simha ) సినిమాల్లో హీరోగా రానిస్తున్న విషయం తెలిసిందే.. గతంలో ఈ హీరో మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని కలిగించగా ఇప్పుడు ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 ( Mathu Vadalara 2) సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో శ్రీ సింహ హీరోగా, ఫరియా అబ్దుల్లా (Faria Abdullah ) హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ లో సత్య కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునేలా ట్రైలర్‌ ఉంది. ఐ యామ్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ లా.. బట్‌ ఐ యామ్‌ నాట్‌ యువర్‌ సన్‌ ఇన్‌లా’ అంటూ సునీల్‌, సత్యల మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నారు. ఎవరికి వారే అన్నట్లు ఒక్కొక్కరు ఒక్కోలా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక కాలభైరవ సంగీతం అలరిస్తుంది.. మొత్తంగా ట్రైలర్ నవ్వులు పువ్వులు పూయిస్తుంది. ఈ సినిమా మొదటి సినిమా కన్నా ఎక్కువగా ఆకట్టుకొనేలా ఉందని తెలుస్తుంది.. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే ..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు