Mathu Vadalara 2: రితేష్ నువ్వు మంచి కంత్రిలా ఉన్నావ్ బేటా

Mathu Vadalara 2: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతోమంది కొత్త దర్శకులు వచ్చారు. వారిలో రితీష్ రానా ఒకరు. మత్తు వదలరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రితీష్ రానా. అయితే అందరి దర్శకులులా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది అని నిరూపించుకున్నాడు రితీష్. సినిమాలో సోషల్ మీడియా కంటెంట్ ని ఏ విధంగా వాడొచ్చు అని ప్రూవ్ చేసి చూపించాడు.ఎస్ ఎస్ రాజమౌళి(Ss Rajamouli) కూడా రితీష్ రానా(Ritesh Rana) గురించి పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు.

మత్తు వదలరా సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలమందికి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా కొత్తగా అనిపించింది. రితీష్ లోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడితో రితీష్ రానా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. ఈ సినిమా తర్వాత రితీష్ హ్యాపీ బర్త్డే అని ఒక సినిమాను చేశాడు. లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.

Mathu Vadalara

- Advertisement -

ప్రస్తుతం మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరగా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేశారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇ టీజర్ లో చాలా డీటెయిల్స్ పెట్టారు. మత్తు వదలరా(Mathu Vadalara) సినిమాలో పెట్టిన ఓరి నా కొడకా సీరియల్ లా దీంట్లో కూడా సీరియల్ కంటిన్యూ అవుతుంది.

Mathu Vadalara

ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్నిచోట్ల స్కానర్స్ పెట్టారు. ఆ స్కానర్స్ ను స్కాన్ చేస్తుంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అయ్యే మీమ్స్ కనిపిస్తున్నాయి. అలానే టీజర్ లో 46వ చికెన్ దగ్గర పాజ్ చేసినట్లయితే, భలే పాజ్ చేశావు గురు అంటూ ఒక స్కానర్ కనిపిస్తుంది. ఆ స్కానర్ ని google లెన్స్ లో స్కాన్ చేస్తే బ్రహ్మానందం బాద్షా సినిమాలోని టెంప్లేట్ కనిపిస్తుంది. ఇలా టీజర్ లో అనేక రకమైన అంశాలను పొందుపరిచాడు రితేష్. దీంతో చాలామంది సోషల్ మీడియాలో నువ్వు భలే కంత్రి లా ఉన్నావ్ బేటా అంటూ రితీష్ ని వేసుకోవడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు