Matka Movie Updates : ‘మట్కా’ సినిమాలో విలన్‌ ఆ స్టార్‌ హీరోనే..?

Matka Movie Updates : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోలు ఎందరో ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నాగబాబు కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. ఈ హీరో అప్పట్లో మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుసగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు.

అయినపట్టికి ఈ హీరో ఏమాత్రం వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం “మట్కా”. మాస్ యాక్షన్ ఎంటర్టైన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పలాస చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Varun Tej's 'VT14' is titled 'Matka' – ThePrint – ANIFeed

- Advertisement -

డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం హై బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ ఆర్ఎఫ్సిలో మ్యాజిక్ సెట్ ను మేకర్స్ సిద్ధం చేశారు. వరుణ్ తన కెరీర్లో ఈ సినిమాను ఓ చాలెంజింగ్ మూవీగా తీసుకోనున్నారు.

ఈ చిత్రంలో అతను ఏకంగా నాలుగు డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా డిఫరెంట్ టైమ్స్ లో కథ ఉందని…. త్వరలోనే మరిన్ని వివరాలతో అందరి ముందుకు వస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే… ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పాత్రలో నెగిటివ్‌ రోల్‌ లో కనిపించనున్నాడట. అంటే ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్‌ అన్న మాట. ఇప్పుడు ఇదే విషయం వైరల్‌ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు