Matka : మళ్ళీ బిజీ అవుతున్న వరుణ్ తేజ్.. బ్లాక్ బాస్టర్ హిట్ పక్కానే ..!

Matka: మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ సక్సెస్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.. ఇక అందులో భాగంగానే వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఈయనకు మంచి విజయాన్ని సాధించి పెట్టలేదు.. ఇదిలా ఉండగా తాజాగా ఈయన పెళ్లి తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలలో మట్కా సినిమా కూడా ఒకటి. పలాస 1978 డైరెక్టర్ కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే మట్కా సినిమా షూటింగ్ వరుణ్ తేజ్.. ఇతర నటీనటులతో ఇప్పటికే అధికారికంగా ప్రారంభం అయింది.

మట్కా పోస్టర్ వైరల్..

Matka : Varun Tej is getting busy again.. Right after blockbuster hit ..!
Matka : Varun Tej is getting busy again.. Right after blockbuster hit ..!

మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి కారణంగా సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతూ ఉండడం.. మరొకవైపు మెగా కుటుంబం కూడా రాజకీయ ప్రచారాలలో పాల్గొంటున్న నేపథ్యంలో సినిమాకి కాస్త బ్రేకులు పడ్డాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది అని చెప్పవచ్చు.. 175 రోజుల తర్వాత కొత్త ఎనర్జీతో.. ఆశలతో జీవితానికి మట్కా రెట్రో మ్యాజిక్ అందించేందుకు సెట్స్ లోకి తిరిగి వచ్చాము అంటూ వింటేజ్ టెలిఫోన్ ను చేతిలో పట్టుకున్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు వరుణ్ తేజ్. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తోంది.. ఇకపోతే ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.

కథకు అనుగుణంగా 4 విభిన్నమైన గెటప్స్..

మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , టైటిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. మట్కా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో వరుణ్ తేజ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతోందని తెలుస్తోంది.. ఈ సినిమాలో నోరా ఫతేహి కథకు అనుగుణంగా నాలుగు విభిన్నమైన గెట్ అప్ లలో కనిపించనున్నట్లు సమాచారం.. ఇక ఇందులో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి మరో ఫిమేల్ రోల్ కూడా పోషిస్తుంది.. ఈ సినిమాకి ఈమె హైలెట్గా నిలవబోతుందని సమాచారం. మరి చాలా రోజుల తర్వాత సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

- Advertisement -

వరుణ్ తేజ్ వ్యక్తిగత జీవితం..

చాలా కాలం పాటు ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నీ ప్రేమించిన ఈయన.. ఈ విషయంపై ఎన్నిసార్లు వార్తలు వినిపించినా.. దాటవేసే ప్రయత్నం చేశాడు.. కానీ ఎట్టకేలకు గతేడాది జూన్లో నిశ్చితార్థం చేసుకొని అందరి అనుమానాలను నిజం చేసిన వరుణ్ తేజ్.. ఆ తర్వాత డిసెంబర్లో ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొని తమ ప్రేమకు శుభం కార్డు పలికారు.. ఇక ఇప్పుడు వివాహం తర్వాత ఎవరికి వారు అటు సినిమాలలో ఇటు వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది ఈ జంట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు