Matthu Vadhalara: మత్తు వదలరా 2 పోస్టర్ లో ఈ డీటెయిల్స్ గమనించారా, రితీష్ రానా వెటకారం కంటిన్యూ అవుతుంది

Matthu Vadhalara: మత్తు వదలరా (Matthu Vadhalara) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రితీష్ రానా. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రజెంట్ చేసింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చెర్రీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సాధించుకొని అద్భుతమైన ఘనవిజయం సాధించింది. సింహ కోడూరి(Simha Koduri), నరేష్ అగస్త్య(Naresh Agasthya), సత్య(Satya) కలిసి నటించిన ఈ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ముఖ్యంగా సత్య కామెడీ హైలెట్ అని చెప్పాలి. అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా టేకింగ్.

ఈ సినిమా తర్వాత రితీష్ రానా దర్శకత్వం వహించిన సినిమా హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) నటించిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమాలోని కొన్ని వీడియోస్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలు వెన్నెల కిషోర్ చేసిన పార్ట్స్ మేజర్ హైలెట్. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా కట్ చేశాడు రితీష్ రానా. 2000 రూపాయల నోట్లపై రాకేష్ మాస్టర్(Rakesh Master) బొమ్మ ఉండటం. అన్ని భాషల్లో తెలుగు అను రాస్తూ తెలుగు పాన్ ఇండియా సినిమా అని పబ్లిసిటీ చేయటం. ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. రాజమౌళి మాట్లాడుతూ రితీష్ రానాకి వెటకారం ఎక్కువ అని ఇదే ఎగ్జాంపుల్ గా కూడా చెప్పాడు.

Ritesh Rana

- Advertisement -

ఇక ప్రస్తుతం మత్తు వదలరా 2 సినిమా వస్తున్న సంగతి. ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక పోస్టర్ లో ఒక వీసిడిని చూపిస్తూ ఉన్నారు. అయితే ఆ వీసిడి పై ఉన్నది బ్రూస్లీ అని అందరూ అనుకుంటారు. కానీ ఆ వీసిడి పై ఉన్నది వెన్నెల కిషోర్ యూత్ స్టార్ యువ అనేది ట్యాగ్. ఆ సినిమా టైటిల్ వచ్చి మొరాన్. దానిపై ఏ ఫిలిం బై రితేజ్ రాజా అని అని రాసుకు వచ్చాడు రితీష్ రానా. ఈ పోస్టర్ చూస్తుంటే రితేష్ రానాకి ఇంకా వెటకారం అలానే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఈ వెటకారాన్ని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా ఉన్నారనేది వాస్తవం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు