Box office: అత్యధిక లాభాలు తెచ్చిన మీడియం రేంజ్ మూవీస్ ఇవే.

తెలుగు సినిమా రేంజి పెరిగింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలు కూడా కూడా పాన్ ఇండియా మూవీస్ గా రూపొందుతున్నాయి. మొన్న కార్తీకేయ2, నిన్న విరూపాక్ష, నేడు “హనుమాన్”. అయితే రిలీజ్ అయ్యే ప్రతి సినిమా హిట్టు కాదు. హిట్టైనా వాటి ప్రాఫిట్స్ ను బట్టే ఆ సినిమాల రేంజ్ డిసైడ్ అవుతుంది. ఈ మధ్యే విడుదలైన చిన్న సినిమా “బలగం” ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 2 కోట్లతో తెరకెక్కిన ఆ చిత్రం 16కోట్లకు పైగా వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. అలా మీడియం రేంజ్ సినిమాల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించిన టాప్ 10 సినిమాలు ఏవో చూద్దాం.

S.no Year  Movie                 Profits    Business
1        2018 గీతా గోవిందం – 55.43CR (15cr)
2        2022 కార్తికేయ2 –       45.60Cr (12.8cr)
3        2021 ఉప్పెన –            31.02Cr (20.5Cr)
4        2017 ఫిదా –                  30.5Cr (18Cr)
5        2022 సీతారామం –     30.30Cr (16.2Cr)
6        2021 జాతిరత్నాలు –  27.52Cr (11Cr)
7        2019 ఇస్మార్ట్ శంకర్ – 22.78Cr (17.7Cr)
8        2023 విరూపాక్ష –        22.77Cr (22.20Cr)** Running
9        2022 బింబిసార –       22.32Cr (15.6Cr)
10      2017 అర్జున్ రెడ్డి –      20.3Cr (5.5Cr)

ఈ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా గీతా గోవిందం నిలిచింది. కేవలం 8కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా 15కోట్ల బిజినెస్ టార్గెట్ కి ఏకంగా 70 కోట్లకి పైగా వసూలు చేయగా నిర్మాతలకి 55 కోట్ల భారీ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది. మరి రానున్న రోజుల్లో గీతా గోవిందం రికార్డును బ్రేక్ చేసి ఏ సినిమా అత్యధిక లాభాల్ని తెచ్చిపెడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు