Meena: అసత్య ప్రచారాలు చేయకండి

ప్రస్తుత కాలంలో ఏదైనా సంఘటన జరిగితే చాలు
మీడియాలో దానిని ఎన్ని రకాలుగా చూపించొచ్చో అన్ని రకాలుగా చూపిస్తారు. అవి కొంతమేరకు బాగానే ఉంటాయి, కానీ పరిధి దాటితే ఆ వార్తలు కొన్ని సార్లు కుటుంబ సభ్యులకి బాధను కలిగిస్తాయి.

రెండు రోజులు క్రితం ప్రముఖ నటి మీనా తన భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ, అంత్యక్రియలను , సినీ ప్రముఖులు అర్పించిన నివాళులు ను పలు మీడియా ఛానెల్స్ చూపించాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఇంకొన్ని ప్రముఖ ఛానెల్స్ కొన్ని కథనాలు నడిపించాయి. పావురాలు వలన మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాడని, కొంతమంది డాక్టర్స్ తో మాట్లాడించడం, ఇంకొందరిని లైన్ లోకి తీసుకుని ఈ విషయంపై చర్చించటం ఇవన్నీ కొంత బాధను కలిగించే విషయాలు. వీటిపై నటి మీనా స్పందిస్తూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక నోట్ ను పోస్ట్ చేసారు.

‘భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. ‘విద్యాసాగర్‌ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.

- Advertisement -

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అనేది ఆ పోస్ట్ యొక్క సారాంశం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు