Meera Jasmine: ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ముఖ్యంగా తెలుగులో గోరింటాకు, భద్ర, గుడుంబా శంకర్ వంటి సినిమాలలో నటించి మంచి ఫేమస్ అయ్యింది.
కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 2014లో పెళ్లి చేసుకుని సినిమాలకి పూర్తిగా దూరమైంది. అలా అని వివాహ బంధాన్ని కూడా ఎంజాయ్ చేయలేక పోయింది. భర్తతో డిస్టబెన్స్ రావడంతో విడాకులు తీసుకుని విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. దీంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ.
తాజాగా తెలుగులో మీరాజాస్మిన్ రీ ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ నో ప్రూ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల వరస హిట్స్ అందుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ” స్వాగ్ ” మూవీ తో మీరాజాస్మిన్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక దీనిని హసిత్ గోలి రూపొందించారు. ఇక నేడు మీరాజాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో యువరాణిగా మీరాజాస్మిన్ కనిపించింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.