Siddharth40 : పెళ్లి తర్వాత మొదటిసినిమా చేస్తున్న క్రేజీ హీరోయిన్..!

Siddharth40 : సౌత్ లో ఎంతో టాలెంట్ ఉన్న హీరోల్లో సిద్ధార్థ్ ఒకరు. ఒకప్పుడు లవర్ బాయ్ గా టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన ఈ హీరో ఆ తర్వాత వరుస పరాజయాల వల్ల కోలీవుడ్ కి వెళ్లిపోగా, అక్కడ కూడా పరాజయాలు అందుకుని ఆల్మోస్ట్ ఫేడౌట్ అయిపోయాడు. ఐతే లాస్ట్ ఇయర్ చిన్నా అనే సినిమాతో కం బ్యాక్ హిట్ ఇచ్చాడు సిద్ధార్థ్. కాగా లేటెస్ట్ గా సిద్ధార్థ్ హీరోగా మళ్ళీ వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. ఇక తాజాగా ఇండియన్2 సినిమాతో కమల్ హాసన్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకున్నా, సిద్ధార్థ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక లేటెస్ట్ గా సిద్ధార్థ్ ల్యాండ్ మార్క్ 40వ (Siddharth40) సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ క్రేజీ భామని తీసుకున్నారు.

Meeta Raghunath is the heroine in Siddharth40

సిద్ధార్థ్ 40 లో గుడ్ నైట్ హీరోయిన్..

ఇక కోలీవుడ్ టాలీవుడ్ లో గుడ్ నైట్ అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన హీరోయిన్ ‘మీతా రఘునాథ్’. ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన మీతా కి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఈ అమ్మాయి తొందరపడకుండా కథలు వింటూ హోల్డ్ లో పెట్టింది. పైగా మంచి క్రేజ్ ఉండగానే ఈ హీరోయిన్ రీసెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. ఈ ఇయర్ మార్చి లో మీతా రఘునాథ్ పెళ్లి సింపుల్ గా బంధు మిత్రుల మధ్య జరిగిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా మీతా రఘునాథ్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న 40 వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ కంఫర్మ్ చేసారు. ఇక మీతా రఘునాథ్ పెళ్లి తర్వాత నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

- Advertisement -

పెళ్లి తర్వాత కంటిన్యూ చేస్తుందా?

ఇక సిద్ధార్థ్ నటించబోయే ఈ 40వ సినిమాను ‘8 తొట్టక్కల్’ సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీ గణేష్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. మహా వీరుడు చిత్ర నిర్మాత అరుణ్ సిద్ధార్థ్ సినిమాను విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు. ఇక మీతా రఘునాథ్ ఈ సినిమా స్క్రిప్ట్ ని పెళ్ళికి ముందే ఒకే చేసిందని సమాచారం. అయితే పెళ్లి తర్వాత యంగ్ ఏజ్ లోనే ఉన్న మీతా పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుందా లేదా అన్నది తెలీదు. ప్రస్తుతానికి ఈ ఒక్క సినిమానే ఒకే చేసిన మీతా, క్రేజీ ఆఫర్లు వస్తున్నా, హోల్డ్ లో పెట్టిందట. మరి ముందు ముందు ఎలాంటి సినిమాలు మీతా చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు