Mega VS Allu : సాయం లోనూ ఎవరూ తగ్గట్లే… నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న అల్లు – మెగా ఫ్యామిలీ ల గొడవ

Mega VS Allu : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీని యానానిమస్ గా శాసిస్తుంది ఈ ఎక్కువగా ఈ ఫ్యామిలీ హీరోలే అని తెలిసిందే. ఎందుకంటే ఒక్క మెగా ఫ్యామిలీ నుండే చిరు సహా నలుగురు స్టార్ హీరోలున్నారు. వీళ్ళే కాకుండా మరో నలుగురు చిన్న హీరోలు కూడా సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ మధ్య కొన్నాళ్లుగా మనస్పర్థలు ఉన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల వరకు మెగా ఫ్యామిలీ గా ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు మెగా VS అల్లు ఫ్యామిలీ అన్నట్టు పరిస్థితి తయారయింది. అయితే వీరి మధ్య మనస్పర్థలు ఎక్కువైంది మాత్రం మూడు నెలల కింద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం వల్ల అని తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే, అల్లు అర్జున్ మాత్రం వెళ్లి వైసిపి లో ఉన్న తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసాడు. అక్కడి నుండి మెగాభిమానులు కూడా మెగా వర్సెస్ అల్లు గా నెట్టింట కూడా వార్ ఎక్కువైంది.

కేరళ బాధితులకు మెగా సాయం..

ఇదిలా ఉండగా, టాలీవుడ్ లో ఎలాంటి కష్టం వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందు గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ అని తెలిసిందే. సార్లు మెగా ఫ్యామిలీ ప్రజల్ని ఆదుకున్నారు. ఇక వాటి గురించి చెప్తే పుస్తకం రాయాలి. అయితే రీసెంట్ గా కేరళలో వాయనాడ్ లో వరద భీభత్సానికి కొండచరియలు విరిగి పడి వరద భీభత్సానికి వాయనాడ్ లో 300 ల మంది ప్రజలు మృత్యువాత పడగా, ఎంతో మంది వరదలో కొట్టుకుపోయారు. ఇక వీరిని ఆదుకోవడానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేయూతనివ్వగా, టాలీవుడ్ నుండి ముందు మెగా ఫ్యామిలీ స్పందించింది. ఇక కేరళ వాయినాడ్ బాధితుల సహాయార్థం అల్లు అర్జున్ 25 లక్షల విరాళం ప్రకటించాడు. ఆ డబ్బుని కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు చేరవేస్తున్నట్టు తెలియచేసాడు.

Mega family stars Chiranjeevi, Ramcharan and Allu Arjun help Kerala victims

- Advertisement -

మెగా సాయంలోనూ ఎవరూ తగ్గట్లే..

అలాగే కేరళ బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి మెగా సాయం ప్రకటించారు. వాయనాడ్ బాధితుల సహాయార్థం 1 కోటి రూపాయల విరాళాన్ని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రకటించారు. ఈ విషయాన్నీ చిరంజీవి స్వయంగా ట్విట్టర్ తో తెలియచేస్తూ… గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, మరియు వందలాది ప్రజలు విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాము. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్‌, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని నా ప్రార్థనలు తెలియచేస్తున్నాను… అంటూ చిరంజీవి ప్రకటించారు.

అయితే నెట్టింట మాత్రం వేరేలా చర్చ నడుస్తుంది. మొన్నటివరకు స్టార్ డమ్ తో పోటీ పడ్డారు. ఇప్పుడు సాయంలో కూడా పోటీ పడుతున్నారు అంటున్నారు నెటిజన్లు. అల్లు అర్జున్ విరాళం ప్రకటించిన కాసేపటికే చిరంజీవి, చరణ్ సహా ఏకంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. దీనిపై నెట్టింట రకరకాలుగా చర్చ నడుస్తుంది. ఇక మెగా – అల్లు ఫ్యాన్స్ ట్విట్టర్ లో మా హీరో ముందు ప్రకటించారని అల్లు ఫ్యాన్స్, మా హీరోలు ఎక్కువ డొనేట్ చేసారని మెగా ఫ్యాన్స్ గొడవ స్టార్ట్ చేసారు. అయితే మెగా ఫ్యామిలీ ల మధ్య గొడవలు ఎలా ఉన్నా, సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇది గమనించి మిగతా స్టార్ హీరోలు కూడా వాయనాడ్ బాధితులకు అండగా నిలిస్తే బాగుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు