KeethySuresh : నెట్టింట కీర్తిని ఆడేసుకుంటున్న మెగా ఫ్యాన్స్.. పాపం ఆ హీరో వల్ల బుక్కైంది!

KeethySuresh : టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహానటిగా తెలుగు ఆడియన్స్ కి చేరువైన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఇప్పుడు అంతగా ఆఫర్లు లేక సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంది. అడపాదడపా ఏ ఇండస్ట్రీ లో మూవీ ఆఫర్ వచ్చినా చేసుకుంటూ వెళ్తుంది. ఇదిలా ఉండగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అంటూ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ వార్ ఎన్టీఆర్, ఎంజీఆర్ ల కాలం నుండి ఉండగా, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరుగుతూ ఉంది. పైగా తమిళ్ వాళ్లకు ప్రతీయాభిమానం పేరుతో కాస్త గర్వం కూడా ఎక్కువ ఉన్నట్టు అంటారు చాలామంది. అయితే ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ మీద తెలుగు నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Mega fans trolling Thalapathy Vijay and Keethy Suresh

మెగా ఫ్యాన్స్ ని హార్ట్ చేసిన కీర్తి…

అయితే తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ల ఫ్యాన్స్ మధ్య రెగ్యులర్ గా ట్రోల్ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, చిరు వర్సెస్ రజినీ, మహేష్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ మధ్య విపరీతమైన ట్రోల్స్ వస్తుంటాయి. అయితే రీసెంట్ గా కీర్తి సురేష్ (KeethySuresh) ఓ ఇంటర్వ్యూ లో చిరంజీవి మరియు దళపతి విజయ్‌ లో ది బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? అని యాంకర్ అడిగితే కీర్తి సురేష్ విజయ్ అని సెలెక్ట్ చేసుకుంది. దీంతో తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా చిరు అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడున్న హీరోలను పక్కన బెడితే సీనియర్ స్టార్ హీరోల్లో డాన్స్ విషయంలో ఇండియాలోనే చిరంజీవి తర్వాతే ఎవరైనా అంటారు. చాలామంది నెటిజన్లు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో కంపేర్ చేసినా చిరంజీవి పేరే చెప్తారు. ఎందుకంటే చిరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ఇక కీర్తి ఇలా విజయ్ పేరు చెప్పడంతో కీర్తిని ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ విజయ్ పాత సినిమాల్లోనే ట్రోల్ అయిన డాన్స్ బీట్లు కీర్తికి ట్యాగ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -

 

కీర్తిని ఆడేసుకుంటున్న ఫ్యాన్స్…

ఇక కీర్తి ఇలా మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన కొన్ని రోజులకే మెగా ఫ్యాన్స్ కి ట్రోలింగ్ బూస్టప్ దొరికింది. తాజాగా రిలీజ్ అయిన విజయ్ గోట్ లో మూడో సాంగ్ నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్ అవుతుంది. ఈ సాంగ్ లో విజయ్ చేసిన స్టెప్పులు పిచ్చి పిచ్చిగా కామెడీగా ఉన్నాయని, నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ సాంగ్ విజయ్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదని తెలుస్తుంది. చిత్ర విచిత్రమైన బీజీఎమ్ లు అటాచ్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఈ సాంగ్ ని కీర్తి సురేష్ తో ట్యాగ్ చేస్తూ, కీర్తిని, విజయ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కీర్తి ఆ మాట అన్న కొన్ని రోజులకే గోట్ మూడో పాట రావడంతో ఫ్యాన్స్ మరింతగా ఆడేసుకుంటున్నారు. కీర్తి ని ట్యాగ్ చేస్తూ… ఇదేనా విజయ్ బెస్ట్ డ్యాన్స్ అంటూ కీర్తి సురేష్ మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ సైతం కొన్ని రోజులు ఈ ట్రోలింగ్ ని ఎదుర్కోక తప్పేట్టు లేదు. మరి కీర్తి దీనిపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు