Mega Star : వింటేజ్ మెగా స్టార్

అరవై ఏళ్లు దాటినా మంచి జోరుతో సినిమాలు తీస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి. క్రేజీ డాన్స్ స్టెప్స్ తో పాటు రొమాన్స్ తో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగా స్టార్. 1990 నుంచే మెగా స్టార్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. తన డాన్స్ మూవ్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ తో ఈలలు వేయించే క్రేజ్ మెగా స్టార్ కు మాత్రమే సొంతం. 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎనో హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ను చూసారు.

ఖైదీ నెంబర్ 150 తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు చిరంజీవి. వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ కు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో. వాల్తేరు వీరయ్య అనే కమర్షియల్ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. సంక్రాతి కానుకగా ఈ సినిమాను 13న విడుదల చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా జనవరి 7న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ట్రేండింగ్ లో నిలుస్తుంది. ట్రైలర్ లో చిరంజీవి డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ స్టైల్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి.ముఠా మేస్త్రీ గెటప్, శంకర్ దాదా MBBS లాంటి కామిక్ డైలాగ్‌స్ , ఖైదీ నంబర్ 150 లుక్స్ మరియు అందరివాడు బాడీ లాంగ్వేజ్ గుర్తుకు వస్తాయి. పాత కాలం నాటి చిరంజీవిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కానీ ఈ చిత్ర దర్శకుడు బాబీ చాలా కాన్ఫిడెంట్ గా సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

- Advertisement -

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు