Mega – Victory: బాక్స్ ఆఫీస్ వద్ద 23 ఏళ్ళు తరువాత పోటీ పడుతున్నారు

Mega – Victory: మామూలు సీజన్ రిలీజ్ అయ్యే సినిమాలు కంటే కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుంది. అందుకే ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తుంటారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇకపోతే 2025 సంక్రాంతికి కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయడానికి చాలామంది స్టార్ హీరో సినిమాలు కూడా ప్లాన్ చేసుకుంటారు.

ఎప్పుడు సినిమాలు చూసినా చూడకపోయినా కూడా సంక్రాంతి సీజన్ లో మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడతారు. ఇకపోతే సంక్రాంతికి ఎప్పుడూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంటుంది. ఇక 2025 సంక్రాంతి విషయానికి వస్తే చాలామంది స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కూడా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. లేకపోతే మళ్లీ సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు.

- Advertisement -

Venky & Anil Ravipudi

దాదాపు 23 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు. విక్టరీ వెంకటేష్ నటించిన దేవిపుత్రుడు సినిమాలు సంక్రాంతి సీజన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. మళ్లీ 23 సంవత్సరాలు తర్వాత ఈ మెగా విక్టరీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కానున్నాయి. ఇక ఈ సినిమాలు ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తాయో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు