Megastar Chiranjeevi: విశ్వంభర సెట్ లో మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్, మెగాస్టార్ ని మరో అవకాశం అడగబోతున్నాడా.?

Megastar Chiranjeevi: ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అంటే ఎస్.ఎస్ రాజమౌళి సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటే వివి వినాయక్ పూరి జగన్నాథ్ వంటి పేర్లు వినిపించేవి. కానీ దురదృష్టవశాత్తు వీరిద్దరూ ఇప్పుడు ఫామ్ లో లేరు అని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ చివరగా తెరకెక్కించిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ ను చవిచూసింది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక వివి వినాయక విషయానికి వస్తే ఇంటిలిజెంట్ అనే సినిమా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఛత్రపతి సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ సాయి హీరోగా హిందీలో తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాకి సరైన ఆదరణ లభించలేదు. ఇకపోతే వివి వినాయక్ ఇప్పటివరకు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు. అయితే మధ్యకాలంలో వివి వినాయక్ మెగాస్టార్ చిరంజీవితో మరో సినిమా చేయబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. దాని గురించి అధికారిక ప్రకటన రాలేదు.

Chiranjeevi VV Vinayak

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్ లోకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ వెళ్లారు. ఈ సందర్భంగానే మెగాస్టార్ తో మరో సినిమా వినాయక చేయబోతున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇదివరకే వశిష్ఠతో వినాయక్ కు మంచి బాండింగ్ ఉంది. అలానే చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకోసమే వెళ్లి కలిశారు ప్రత్యేకంగా సినిమా అంటూ ఏమీ లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు