Chiranjeevi : ఆ విషయంలో కొడుకుతో పోటి పడుతున్న మెగాస్టార్.. లుక్ అదిరింది బాసూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు మంచి మార్కెట్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో పాటుగా పలు రకాల యాడ్స్ ను చేస్తూ బిజీగా ఉన్నారు. అందరి మాట ఏమోగాని రామ్ చరణ్ (Megastar Chiranjeevi) మాత్రం గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాలు లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు. అలాగే ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చి చేరాడు. తాజాగా చిరంజీవికి (Chiranjeevi ) సంబందించిన ఒక యాడ్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది..

ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు సినిమాలతో పాటుగా యాడ్స్ లో కూడా పలకరిస్తారని తెలిసిందే. ఇప్పుడిప్పుడు వచ్చిన స్టార్లే యాడ్స్ చేసేస్తుంటే స్టార్ హీరోలు చేయకుండా ఉంటారా? అస్సలు ఉండరు.. వారి క్రేజ్ ను కొన్ని కంపెనీలు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తాయి. ఖైదీ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడు పలు యాడ్స్ చేసి అటు కమర్షియల్ గా సక్సెస్ అవుతూనే ఇటు ఫ్యాన్స్ ని కూడా మెప్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆ యాడ్ వీడియోనే నెట్టింట ట్రెండ్ అవుతుంది.

megastar chiranjeevi country delight add video viral in social media
megastar chiranjeevi country delight add video viral in social media

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Sankar ) డైరెక్షన్స్ లో కంట్రీ డిలైట్ (Country Delight) అనే పాల యాడ్ చేసారు. యాడ్ లో కూడా డ్యుయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ యాడ్ లో చిరంజీవితో పాటు కమెడియన్ సత్య కూడా నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో ఎలా ఉందో ఒక లుక్ వేసుకోండి. ఇక ఈ యాడ్ లో చిరంజీవి లుక్ అదిరిపోయింది.. ఆ వీడియోను మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం కొడుకుతో పోటీకి రెడీ అవుతున్న చిరంజీవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వశిష్ఠ (Vasista)దర్శకత్వంలో విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు…

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు