Megastar Chiranjeevi: ఆ సినిమా మార్నింగ్ షో పడగానే చిరంజీవికి పోలీసులు ఫోన్ చేశారు

Megastar Chiranjeevi: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇస్తే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయింది. మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతమైన రద్దీ ఉండేది రద్దీ ఉండేది. మెగాస్టార్ సినిమాకు మొదటి రోజు టికెట్ దొరకడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడైతే కొన్ని యాప్స్ వచ్చేసి సినిమా టిక్కెట్ను ఇంటి దగ్గర నుంచి కొనుక్కోగలుగుతున్నాం. అని ఒకప్పుడు సినిమా టికెట్ కావాలంటే క్యూలో నిలబడి నానా కష్టాలు పడి టికెట్ కొనుక్కోవాల్సిందే. కొన్నిసార్లు క్యూలో నిలుచున్న కూడా టికెట్ దొరుకుతుందని గ్యారెంటీ లేదు. చిరంజీవి సినిమాకి ఫస్ట్ డేట్ ఎక్కడ దొరకడం అంటే చాలామంది అదృష్టంగా భావించేవారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో వచ్చాయి. అన్నిటిని మించి ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఏకైక సినిమా ఇంద్ర. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కనిపించిన విధానం, ఈ సినిమాలో మెగాస్టార్ క్యారెక్టర్జేషన్, ఈ సినిమా డైలాగ్స్, మణిశర్మ అందించిన మ్యూజిక్, కాశీ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే ఈ సినిమా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని నిర్మాత కూడా ఒక నమ్మకం కుదిరింది.

Megastar Chiranjeevi's Indra

- Advertisement -

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే విజయవాడకు చెందిన ఒక కమిషనర్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫోన్ చేశారు. ఒకసారి ఈ సినిమా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది కానీ మీ ఫ్యాన్స్ ని కాస్త కంట్రోల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి సాయం చేయమని చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేశారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అశ్విని దత్ రీవీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది బాస్ మానియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు