Vishwambhara: విశ్వంభర మ్యూజిక్ సిటింగ్స్ లీక్ చేసిన మెగాస్టార్

Vishwambhara: గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. పదేళ్లపాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చినా కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి చూపించారు. అయిపోతే మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా మంచి రెస్పాన్స్ ను సాధించాయి. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక సినిమా తర్వాత వచ్చిన భోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. తమిళ్ లో సూపర్ హిట్ సినిమా వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చినా కూడా వాటిని నిలబెట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం విశ్వంభరా అనే సినిమాను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. బింబిసారా సినిమాతో దర్శకుడుగా పరిచయమైన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఇక రెండో సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశాన్ని పొందుకున్నాడు వశిష్ట. ఈ సినిమా సంక్రాంతి కనుక రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎం ఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించారు కీరవాణి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డును కూడా తీసుకొచ్చి పెట్టారు. అయితే నేడు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభరా సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ ను లీక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

- Advertisement -

Megastar who leaked music sittings of Vishwambhara

ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అంటే సినిమాకు సంబంధించిన హీరో నిర్మాత అందరూ కలిసి కూర్చొని సంగీత దర్శకుడు వినిపించే పాటలు వాళ్ళందరికీ నచ్చిన తర్వాత బయటకు రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పద్ధతి కంప్లీట్ గా మారిపోయింది. మళ్లీ అదే పద్ధతిలో విశ్వంభరా సినిమాకు సంగీతం చేస్తున్నారు అంటూ ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వీడియోలు ఆపద్బాంధవుడు పాటను ఆలపిస్తున్నారు ఎం ఎం కీరవాణి. అలానే కీరవాణి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు