Bhola Shankar: మెహర్ రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు- మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కిన మెహర్

డైరక్టర్ మెహర్ రమేష్ కు సోషల్ మీడియా ట్రోలింగ్ కొత్తేమి కాదు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన శక్తి సినిమాతో మొదలైన ఈ ట్రోలింగ్ నేటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది, వాస్తవానికి మెహర్ రమేష్ కు ఇన్ని రోజుల పాటు సినిమా రాకుండా ఉండటానికి కారణం కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగే అని చెప్పాలి.

దాదాపు మెహర్ రమేష్ పదేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ మెగా ఫోన్ చేతిలో పట్టుకొని మెగా స్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అయితే ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్స్ సినిమాలపై గత కొద్దీ రోజులుగా ఆసక్తి చూపించని ప్రేక్షకులు భోళా శంకర్ ను కూడా తిప్పికొడుతున్నారు. దానికి తోడు భోళా శంకర్ సినిమా పాటలు, ట్రైలర్ లు ఏ మాత్రం కొత్తగా లేకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులను ఆసక్తి లేకుండా పోయింది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమంలన్నీ ముగించుకొని ఆగస్ట్ 11న రిలీజ్ అవడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మెహర్ రమేష్ వేదాళం సినిమాపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. వేదాళం సినిమా ఒక క్రింజ్ సినిమా అంటూ ఆయన చెబుతూ.. ఆ సినిమాలోని 70 శాతం కథ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా భోళా శంకర్ సినిమాను మలిచామని అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

దాంతో హీరో అజిత్ ఫ్యాన్స్ మెహర్ రమేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంత క్రింజ్ సినిమా అయినపుడు రీమేక్ ఎందుకు చేస్తున్నారంటూ మెహర్ రమేష్ పై మిమ్స్ వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దాంతో మరోసారి ట్రోలర్స్ తో ట్రోలింగ్ చేయించుకోవడం ఏమాత్రం ఇష్టం లేని మెహర్ లేటెస్ట్ గా ట్విట్టర్ ద్వారా ఈ విషయం పై స్పందిచారు ” 2015లో వేదాళం సినిమా చూశాను. అది నాకు బాగా నచ్చింది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న బలమైన బంధాన్ని డైరెక్టర్ శివ సార్ చూపించిన విధానం నచ్చి, ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులందరికీ చూపించాలనుకునే ఉద్దేశ్యం తోనే భోళా శంకర్ సినిమా తీసాను. 2009లోనూ అజిత్ సార్ హీరోగా నటించిన బిల్లా సినిమాను ప్రభాస్ తో చేశాను. మళ్లీ ఇప్పుడు అజిత్ సార్ నటించిన మరో సినిమాను తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు రెడీగా ఉన్నాను. మరో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కానుంది” అంటూ మెహర్ రమేష్ ట్విట్ చేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు