Pawan Kalyan: పవన్ ని కలిసి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేసిన మెహర్ రమేష్.‌.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అదే గుర్తింపును పాలిటిక్స్ లో కూడా సంపాదించుకోవాలి అనే తపనతో కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక తన తపన అండ్ ఆరాటం తాజాగా నెరవేరింది.

2024లో టిడిపి తో చెయ్యి కలిపిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అంతేకాకుండా భారీ మెజారిటీతో ఘనవిజయం కూడా సాధించాడు. దీంతో ఇటు మెగా ఫ్యామిలీతో పాటు మరోపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అంతేకాకుండా పవన్ కోసం ఎంతగానో కష్టపడ్డా సినీ సెలబ్రిటీలు అండ్ బుల్లితెర సెలబ్రిటీలు కూడా పవన్ విజయంతో ఎంతో సంతోషపడ్డారు.

ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియా వేదికగా పవన్ కి కంగ్రాట్స్ తెలియజేశారు. ఇక నిన్న అనగా జూన్ 12న పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ పవన్ని కలిసి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేశాడు. దీనికి పవన్ కూడా థాంక్స్ చెబుతూ మెహర్ రమేష్ ని హగ్ చేసుకున్నాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు