Meiyazhagan : దిల్ రాజ్ ను ఇమిటేట్ చేసిన కార్తీ

Meiyazhagan :సౌత్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన క్లాస్ లవ్ స్టోరీస్ లో 96 సినిమా ఒకటి. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) త్రిష(Trisha) నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచింది. మంచి కలెక్షన్స్ ని కూడా ఈ సినిమా వసూలు చేసింది. ఇదే సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా తెలుగులో అంతగా వర్కౌట్ కాలేదు. సమంత శర్వానంద్ కలిసిన నటించిన ఈ సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా అందుకోలేకపోయింది. లేకపోతే ఈ సినిమాని మొదటి నానితో చేయడానికి ప్లాన్ చేశారు దిల్ రాజు. కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలుగా దిల్ రాజు(Dil Raju) ప్రధమ దశలో ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు దిల్ రాజు. ఇళయ దళపతి విజయ్(Vijay) హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాను నిర్మించారు రాజు. సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అయితే విజయ్ తెలుగు సినిమాలుకు సంబంధించి పెద్దగా ప్రమోషన్స్ లో ఉండరు కాబట్టి చెన్నై ప్రమోషన్స్ లో దిల్ రాజు పాల్గొన్నారు. ఇకపోతే వారసుడు(Varasudu) సినిమా ఆడియో లాంచ్ లో దిల్ రాజు తమిళ్ లో స్పీచ్ ఇచ్చారు.

Meiyazhagan

- Advertisement -

వారసుడు సినిమాకి సంబంధించి దిల్ రాజు ఇచ్చిన స్పీచ్ అప్పట్లో వైరల్ గా మారింది. అదే స్పీచ్ చాలామంది ఇమిటేట్ కూడా చేయటం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం తమిళ్లో మోయజగన్ అనే సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమాకు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 96 సినిమా తర్వాత సి ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది. కార్తీ నటిస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ రీసెంట్గా జరిగింది. ఈ ఆడియో లాంచ్ లో కార్తీ మాట్లాడుతూ దిల్ రాజును ఇమిటేట్ చేశారు.

దిల్ రాజు వైరల్ స్పీచ్ మరొకసారి గుర్తు చేస్తూ.. ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, లవ్ వేణుమా లవ్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు అంటూ కార్తీ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను అఫీషియల్ గా కొన్ని రోజుల్లో టీవీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు