Mia Khalifa.. మియా ఖలీఫా (Mia Khalifa).. ప్రముఖ పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అడల్ట్ ఇండస్ట్రీని ఒకప్పుడు ఒక తన అందచందాలతో నిద్ర లేకుండా చేసింది. అయితే ఈ మధ్యకాలంలో అడల్ట్ ఇండస్ట్రీని వదిలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను పోర్న్ స్టార్ గా మారడం వెనుక అసలు కథను చెప్పుకొచ్చింది.
మోడలింగ్ పేరుతో పోర్న్ ఊబిలోకి..
మియా కలీఫా ఒకప్పుడు అత్యంత పాపులర్ ఫోర్న్ స్టార్ లలో ఒకరిగా కొనసాగింది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. తాను ఎప్పుడూ కూడా పోర్న్ స్టార్ అవ్వాలని అనుకోలేదట. మియా కలీఫా చెబుతున్న దాని ప్రకారం ఆమె తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. ఆ మోడలింగ్ అసైన్మెంట్ తనను పోర్న్ ఊబిలోకి నెట్టేసిందట. ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మియా ఖలీఫా మాట్లాడుతూ.. నేను పోర్న్ చేయడానికి ఎవరి అంగీకారం కూడా పొందలేదు. మీరు చాలా అందంగా ఉన్నారు.. న్యూడ్ మోడలింగ్ చేయమని చెప్పారు.. శరీరాన్ని ముట్టుకోరు కదా నగ్నంగా చూపించడంలో తప్పేముంది అనుకొని అలా నేను మోడలింగ్ మొదలు పెట్టాను.
నీలి చిత్రాలలో నటించా..
స్టూడియో కి వెళ్ళిన ప్రతిదీ కూడా నాకు గౌరవప్రదంగా అనిపించింది.అందరూ బాగున్నారు. ఎటువంటి సందేహం రాలేదు. అయితే ఒక న్యూడ్ మోడలింగ్ కాంట్రాక్ట్ సంతకం చేయడానికి వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ చదవకుండానే సంతకం చేశాను. అలా పోర్న్ సినిమాపై సంతకం చేసానని తెలిసింది. ఇక న్యూడ్ మోడలింగ్ పేరుతో అడల్ట్ వీడియోలు చేయించేందుకు మోసం చేశారు.. నన్ను ఉపయోగించుకోవడానికి కుట్ర జరుగుతోందని తెలిసి అధైర్య పడకుండా నీలి చిత్రాలలో కూడా నటించాను. అప్పుడు కూడా నా సొంత నిర్ణయాలు తీసుకున్నాను.. కానీ కొద్ది రోజుల్లోనే పోర్న్ స్టార్ గా మారిపోయా జనంలోకి వెళ్ళినప్పుడు చాలా అసహ్యంగా నన్ను చూసేవారు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్య పాలయ్యాను. 21 సంవత్సరాల వయసులో 2014లో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నేను మూడు నెలల తరవాతే అందులో నుంచి బయటపడ్డాను .కానీ ఇప్పటికీ ఆ అడల్ట్ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అతడు మోసం చేయడం వల్లే పోర్న్ స్టార్ అయ్యా..
తనను ఒక వ్యక్తి అసలు నిజం చెప్పకుండా ఇలా మోడలింగ్ పేరుతో నన్ను పోర్న్ రంగంలోకి దించేశారు. అతడి వల్లే నేను నేడు అందరిలో కూడా చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. అతడు చేసిన తప్పు నా జీవితాన్నే మార్చేసింది అంటూ ఎమోషనల్ అయింది మియా కలీఫా. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని మాత్రం మియా వెల్లడించలేదు. ప్రస్తుతం మియా ఖలీఫా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. మరి ఈమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. ఏది ఏమైనా తనను తాను మార్చుకోవాలి అనుకున్నప్పుడు కనీసం ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.