Mirchi Movie: అనుష్క పక్కన స్టెప్పులేసిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ఇప్పుడు చూస్తే షాక్..!

Mirchi Movie: పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో రికార్డులు బద్దలు కొట్టేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ప్రభాస్ పేరే వినిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీ దత్ , స్వప్న దత్ కలసి నిర్మించిన చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో రూ .1000 కోట్లు అందుకున్న హీరోల సినిమాలలో రెండు సినిమాలు ప్రభాస్ వే కావడం గమనార్హం. ఒకటి బాహుబలి ,ఇప్పుడు రెండవది కల్కి..

Mirchi Movie: Do you remember this beauty who stepped next to Anushka.. Shocking to see now..!
Mirchi Movie: Do you remember this beauty who stepped next to Anushka.. Shocking to see now..!

ప్రభాస్ మిర్చి సినిమా..

ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో మిర్చి సినిమా కూడా ఒకటి.. బాహుబలి సినిమా కంటే ముందు రిలీజ్ అయిన ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.. ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు.. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు.. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక సాంగ్లో అనుష్క పక్కన సైడ్ డాన్సర్ గా చేసిన అమ్మాయిని మీరు గుర్తుపట్టారా? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

అనుష్క పక్కన నటించిన డాన్సర్ ఎవరంటే..

ఆ పాట ఏదో కాదు డార్లింగే ఓసి నా డార్లింగే.. ఈ పాటలో అనుష్క పక్కన కనిపించిన అమ్మాయికి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది.. ఆమె ఎవరో కాదు భాను శ్రీ.. సినిమాలలో అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లు పోషించిన భాను శ్రీ.. ఆ తర్వాత పటాస్ అనే షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా సక్సెస్ అందుకుంది.. ఇక యాంకర్ గా మారి కొన్ని షోలు చేసింది ..ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు భాను శ్రీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.

- Advertisement -

భాను శ్రీ కెరియర్..

భాను శ్రీ ప్రస్తుతం సినిమాలలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో నటిస్తూనే.. మరొకవైపు బుల్లితెరపై సందడి చేస్తూ వస్తోంది.

అనుష్క కెరియర్..

ఇక అనుష్క విషయానికి వస్తే.. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించిన ఈమె.. ఇప్పుడు మరో మళయాల చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.. ఇక ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం గమనార్హం.. మరి ఎప్పుడు ఈ ముద్దుగుమ్మ పూర్తిస్థాయిలో రీయంట్రీ ఇస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు