Mirzapur 3 : అంతా ఆమె చేసింది… మరో హీరోయిన్ తో ఇంటిమేట్ సీన్స్ పై తమన్నా లవర్ షాకింగ్ కామెంట్స్

Mirzapur 3 : మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3 త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతోంది. ప్రేక్షకులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న తాజా సీజన్ రిలీజ్ కు రెడీ అవ్వడంతో ఇప్పటికే మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసి మరింత ఆసక్తిని పెంచేశారు. అయితే సీజన్ 3లో కొన్ని షాకింగ్ సన్నివేశాలు కనిపించాయి. అందులో ఒక సీన్ లో గోలు అంటే శ్వేతా త్రిపాఠి, ఛోటే త్యాగి (విజయ్ వర్మ) మధ్య సన్నిహిత సన్నివేశం ఉంది. ఈ దృశ్యం అల్మోస్ట్ శృంగారంలా ఉంది. తాజాగా విజయ్ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాడు. ఛోటే త్యాగికి శృంగారం చేయడాన్ని గోలు నేర్పించింది అంటూ పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు.

ఆమె రొమాన్స్ నేర్పిస్తుంది..

తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తాజా ఇంటర్వ్యూలో గోలు, ఛోటే మధ్య సన్నిహిత సన్నివేశం గురించి ఓపెన్ అయ్యారు. ‘ఈ సీన్‌లో అమాయకంగా, మనస్సులో శృంగారభరితమైన ఆలోచనలతో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయి ఉన్నాడు. అయితే ఇద్దరి మనసులు కలవడంతో రొమాన్స్ ఎలా చేయాలో తెలియని ఆ అబ్బాయికి ఆమె గురువుగా మారుతుంది. ఆ పాత్ర కోసం గోలుతో ఈ తరహా ప్రయోగాలు చేయడం ఆసక్తికరంగా ఉంది. నిజానికి ముందు ఆమె మామూలుగా అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. గోలు మొదటి సన్నివేశంలో లైబ్రరీలో శృంగార సాహిత్యం చదువుతూ కన్పించడం చాలామందికి గుర్తుండదు. అయితే అదే సాహిత్యం తనకంటే చిన్నవాడైన త్యాగికి రొమాన్స్ ను నేర్పించడంలో హెల్ప్ చేస్తుంది’ అంటూ ఆ సీన్ గురించి వివరించారు.

article-image

గోలు బెల్ట్ తో కొట్టమని చెప్పగానే..

ఆ సన్నివేశంలో విజయ్ తన ఇన్‌పుట్ ఎలా ఇచ్చాడో గుర్తు చేసుకున్నాడు. ‘గోలు అతనికి బెల్ట్ ఇచ్చి కొట్టమని చెప్పినప్పుడు, అతను తనను తాను కొట్టుకోవడం ప్రారంభిస్తాడు. నేను ఈ ఐడియా ఇవ్వగానే గురు (దర్శకుడు గుర్మీత్ సింగ్) నవ్వడం మొదలుపెట్టాడు. ఆమె ఏమి చెబుతుందో ఆ వ్యక్తికి తెలియదని నేను ఆమెకు చెప్పాను” అంటూ సదరు సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

ఇంటిమేట్ సన్నివేశాలను ఇలా తీశారా?

మీర్జాపూర్‌లో చాలా సన్నిహిత సన్నివేశాలు ఉంటాయాన్న విషయం తెలిసిందే. సాన్నిహిత్యం కో-ఆర్డినేటర్ లేకుండా మూడవ సీజన్ లో ఆ ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించారట. ఇంటిమేట్ సీక్వెన్స్‌లు స్ట్రక్చర్డ్ కొరియోగ్రఫీలో ఎక్కువగా ఉంటాయని కూడా ఆయన వెల్లడించారు. విజయ్ దాని గురించి మాట్లాడుతూ “ఇది ఇతర కదలిక-ఆధారిత, టచ్-ఆధారిత వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాబట్టి లైంగిక సన్నివేశాలు యాక్షన్, డ్యాన్స్ సీక్వెన్స్‌ల మాదిరిగానే ఉంటాయి. ఈ మూడింటికి ఒకే రకమైన ప్రిపరేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమి తాకవచ్చు? ఏమి చేయవచ్చు అని ముందే చెప్తారు. మీ సేఫ్ జోన్, నో-గో జోన్ పరంగా ప్రతిదీ అర్థం చేసుకుంటాము” అంటూ ఇంటిమేట్ సీన్స్ ను ఎలా తీస్తారో వివరించారు. కాగా మిర్జాపూర్ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో జూలై 5న విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు