Miss Nakshatra: మిస్ వైజాగ్ నుంచీ రోడ్డుకి.. ఈమె ఎవరు? ఈమె కథ ఏంటి..?

Miss Nakshatra…గత రెండు మూడు రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో ప్రధమంగా వినిపిస్తోంది.. తన భర్త తనను దారుణంగా వేధిస్తున్నాడని, కొడుతున్నాడని. అంతేకాదు రోజుకొక వర్జిన్ అమ్మాయిని తీసుకురావాలని హింసిస్తున్నాడు అంటూ తెగ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే . అంతేకాదు ఈమె భర్త తేజ ఈమెను కొడుతున్న ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో ఎవరీ నక్షత్ర..? మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న ఈమె రోడ్డుకు ఎలా వచ్చింది? అసలు ఈమె స్టోరీ ఏంటి ? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజెన్స్ సైతం తెగ ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నక్షత్రం, తేజ ల పరిచయం, ప్రేమ, పెళ్లి

Miss Nakshatra: From Miss Vizag to Road.. Who is she?  What is her story?
Miss Nakshatra: From Miss Vizag to Road.. Who is she? What is her story?

నక్షత్ర.. గతంలో మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించి మిస్ వైజాగ్ టైటిల్ ని సొంతం చేసుకుంది.. 2013 డిసెంబర్ లో ఒక మూవీ ఆడిషన్స్ కోసం నక్షత్ర వెళ్ళగా… అక్కడే ఈమెకు తేజ పరిచయం అయ్యాడు .. మూవీ షూటింగ్లో భాగంగానే ఇద్దరు ప్రేమలో పడ్డారు. 2015 ఫిబ్రవరి లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోగా.. వీరిద్దరి ప్రేమ , పెళ్లి బంధానికి గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది..

నక్షత్ర వెర్షన్ : పబ్జి గేమ్ కి బానిస..

అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కరోనా వచ్చి పడింది.. దీంతో పబ్జి గేమ్ కి బానిస అయిపోయి డ్యూటీ కి కూడా వెళ్లేవారు కాదట తేజ..ఈయన నావెల్ డాక్ యార్డ్ లో పనిచేసేవాడు .. ఉద్యోగానికి కూడా వెళ్లకుండా లేచింది మొదలు తెల్లవార్లు గేమ్ ఆడుతూ అమ్మాయిలతో నీచంగా మాట్లాడేవాడు.. ఉదయం పడుకునేవాడు.. దీనివల్ల అధికారులు తేజాను జాబ్ నుంచి సస్పెండ్ చేశారు.. అంటూ నక్షత్ర తెలిపింది.

- Advertisement -

పబ్జి గేమ్ తో అమ్మాయిల కు వల..

అసలు తీరిక క్షణం లేకుండా గేమ్ ఆడుతూ అందమైన అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు.ముఖ్యంగా పబ్జి గేమ్ ఆడే అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ.. 24 గంటలు ఫోన్ లోనే గడిపేవాడు.. ప్రశ్నిస్తే వేధించేవాడు.. చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడు అంటూ నక్షత్ర ఆరోపించింది.. ఆడది కనిపిస్తే చాలు వదిలిపెట్టడు.. అక్కను కూడా అదే ఉద్దేశంతో చూసేవాడు.. వావి వరసలు లేవు.. చాలామంది అమ్మాయిలతో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడేవాడు.. వాయిస్ రికార్డులు, అమ్మాయిలతో చాట్ చేసిన మెసేజ్ లు అన్నీ సాక్షాలు నా దగ్గర ఉన్నాయి అంటూ ఆమె తెలిపింది..

అడిగితే హింసించేవాడు..

ఇతరులతో ఎఫైర్లు నడపడం ఏంటి అని అడిగితే.. మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.. దారుణంగా కొట్టాడు కూడా.. ఒకసారి కాలు కూడా విరగొట్టాడు.. రోజుకో వర్జిన్ అమ్మాయిని తీసుకురమ్మని.. నువ్వు సంసారానికి పనికి రావు అంటూ నన్ను టార్చర్ చేశాడు.. అతడు ఒక ఉమెనైజర్ .. అతని ఫోన్ నిండా బూత్ వీడియోలే ఉంటాయి అంటూ ఆరోపించింది .. అంతేకాదు అతడు ఎన్ని దారుణాలు చేసినా పాప కోసమే భరించాను..ఎంత సహనం పాటించినా అతను మారలేదు అంటూ తెలిపింది నక్షత్ర..

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తేజ..

ఇక తన భర్త ఇంకో అమ్మాయితో గదిలో ఏకాంతంగా గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా నక్షత్ర పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండా తన భర్త తేజ వేరే మహిళలను వివాహం చేసుకున్నారని ఆరోపించింది.. మరొకవైపు భర్తతో పట్టుబడిన అమ్మాయి నక్షత్రను బెదిరించిందని.. మీ కూతురుతో ఎలా బ్రతుకుతావో చూస్తా అంటూ బెదిరిస్తోందని కూడా నక్షత్ర ఆరోపించింది..

ధర్నాకు దిగిన నక్షత్ర..

ఇక దీంతో మే 30న విశాఖపట్నంలోని తన భర్త ఆఫీస్ ముందు న్యాయం కోసం ధర్నాకు దిగారు నక్షత్ర..

తేజ వెర్షన్:

మరొకవైపు తేజ తనపై నక్షత్ర చేసిన ఆరోపణలు నిజం కాదని.. తన మీద పలు కేసులు ఉన్నాయని.. అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయని తేజ వెల్లడించారు.. తనతో గదిలో ఉన్న అమ్మాయి ఆడిషన్ కి వచ్చిందని..మూవీ తీసే ప్లాన్లో ఉన్నామని కూడా తెలిపారు.. ఇలా తమ కుటుంబ సమస్యల కారణంగా ఒకప్పటి మిస్ వైజాగ్ ఇప్పుడు రోడ్డున పడిందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు