Miss Nakshatra: ఎఫైర్స్ తో మునిగితేలుతున్న నక్షత్ర భర్త.. హీరోయిన్ పూర్ణ తో కూడా..

Miss Nakshatra: మిస్ వైజాగ్ టైటిల్ ని సొంతం చేసుకున్న నక్షత్ర.. నేడు రోడ్డున పడడం అందరిలో చర్చనీయాంశంగా మారింది.. మే 30వ తేదీన విశాఖపట్నంలోని తన భర్త తేజ ఆఫీస్ ఎదుట న్యాయం కోసం ధర్నాకు దిగడంతో ఈమె కాస్త వెలుగులోకి వచ్చింది .. తన భర్త చేస్తున్న అక్రమాలను ఎండగడుతూ మీడియా ముందు పలు విషయాలు తెలియజేసింది. ఇక అందులో భాగంగానే హీరోయిన్ పూర్ణ పేరు కూడా తెరపైకి రావడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అసలు ఏమిటి కథ? ఈమె భర్త ఈమెకు ఎలాంటి అన్యాయం చేశారు? హీరోయిన్ పూర్ణ కి వీరికి మధ్య సంబంధం ఏమిటి ? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మిస్ వైజాగ్..

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 2013లో మిస్ వైజాగ్ టైటిల్ ని గెలుచుకున్న నక్షత్ర ఒక సినిమా షూటింగ్లో భాగంగానే నటుడు తేజతో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. అది 2015లో పెళ్లిగా మారింది. ఆ తర్వాత వీరు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇక 2019లో కరోనా వచ్చిన తర్వాత అప్పటివరకు సవ్యంగా సాగిన వీరి జీవితం ఒక్కసారిగా అతలాకుతలం అయింది. నావెల్ డాక్ యార్డ్ లో పనిచేసే తేజ పబ్జి గేమ్ కు అలవాటు పడి.. అందులో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వారికి అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపిస్తూ ఎంజాయ్ చేసేవారట.. ఒకసారి ఈ విషయాన్ని గమనించిన నక్షత్ర ఏమిటని అడగడంతో ఆమెను శారీరకంగా హింసించి కాలు కూడా విరగ్గొట్టినట్లు… పైగా అతనొక ఉమనైజర్ .. చాలామందితో ఎఫైర్స్ నడిపాడు అంటూ స్వయంగా నక్షత్ర వెల్లడించింది.

రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నక్షత్ర భర్త..

అయితే తాజాగా తేజ ఒక అపార్ట్మెంట్లోని గదిలో ఏకాంతంగా ఇంకో మహిళతో కనిపించడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది నక్షత్ర.. ఈ నేపథ్యంలోనే ధర్నాకు దిగగా.. అతడు ఇది ఆఫీస్ అని.. ఆమె ఆడిషన్స్ కోసం వచ్చింది అంటూ బుకాయిస్తున్నట్లు మీడియాతో తెలిపింది నక్షత్ర..

- Advertisement -

పూర్ణ డేటింగ్ కి రమ్మని పిలిచింది..

Miss Nakshatra: Nakshatra's husband drowning in affairs.. with heroine Poorna too..
Miss Nakshatra: Nakshatra’s husband drowning in affairs.. with heroine Poorna too..

ఇక ఈ క్రమంలోనే హీరోయిన్ పూర్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది.. పూర్ణ కూడా నన్ను రమ్మనింది.. పూర్ణ నాతో డేటింగ్ చేయమని పిలిచింది అంటూ స్వయానా తనతో చెప్పాడని నక్షత్ర మీడియా ప్రతినిధులతో తెలిపింది. తేజ పూర్ణాతో కలిసి బ్యాక్ డోర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పూర్ణ తనతో డేటింగ్ చేయమని చెప్పినట్లు తేజా తనతో చెప్పాడని ఆమె తెలిపింది.. ఇక నేను బ్యాక్ డోర్ సినిమా డైరెక్టర్ కి కూడా ఫోన్ చేసి ఈ విషయాన్ని అడిగితే.. ఊరుకోండమ్మ మీ ఆయన అలాగే అంటాడు అని చెప్పాడు ఆయన .. పూర్ణ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. ఈ విషయం పూర్ణ వరకు వెళ్లిందో లేదో నాకు తెలియదు అంటూ తెలిపింది నక్షత్ర. పూర్ణ నన్ను రమ్మని చెప్పింది అని మాత్రమే నాతో చెప్పాడు.. అంటూ తెలిపింది నక్షత్ర..

విడాకులు ఇవ్వకుండానే ఇంకో అమ్మాయితో పెళ్లి..

ఇక ఇది ఈ ఆఫీస్ అంటున్నారు.. ఆమె ఆడిషన్స్ కోసం వచ్చింది అంటున్నారు అని తేజ చెబుతున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా.. మరి ఇది ఆఫీస్ అయితే ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరితో భార్యని చెప్పి గృహప్రవేశం ఎలా చేశాడు? అంటూ కూడా ప్రశ్నిస్తోంది. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులంతా కూడా సాక్ష్యం చెబుతున్నారు కదా.. వైఫ్ అని చెప్పాడు.. ఇద్దరూ కలిసి గృహప్రవేశం చేసి పూజలు కూడా నిర్వహించారు అని.. అదెలా చేశారు మరి అంటూ ప్రశ్నిస్తోంది నక్షత్ర ..ఇక ఈ విషయాలు విన్న నెటిజన్స్ కూడా.. మొత్తానికి అయితే వీడు మామూలోడు కాదు.. ఏకంగా పూర్ణ నే తనతో డేటింగ్ కి పిలిచిందని చెప్పడం ఆశ్చర్యకరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరోవైపు దీనిపై పూర్ణ అభిమానులు పూర్తిస్థాయిలో ఆగ్రహం చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇది పూర్ణ వరకు వెళ్తే ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు