Modern Masters: రాజమౌళి డాక్యుమెంటరీ ని తెరకెక్కించింది ఎవరంటే..?

Modern Masters.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాజమౌళి పై డాక్యుమెంటరీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈయన సినీ విజన్ పై పలువురు దిగ్గజ స్టార్ హీరోలు మాత్రమే కాదు హాలీవుడ్ దర్శకుడు కూడా మాట్లాడుతూ ప్రశంసించారు. అంతేకాదు రాజమౌళి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఒక్కొక్కరిగా వెల్లడించారు కూడా.. అయితే రాజమౌళిని తిరిగి మళ్లీ మనకు పరిచయం చేసింది ఎవరు? అంటూ అభిమానుల సైతం ఆత్రుతగా ఆసక్తిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు.

Modern Masters: Who directed the Rajamouli documentary?
Modern Masters: Who directed the Rajamouli documentary?

రాజమౌళి డాక్యుమెంటరీని నిర్మించింది బాలీవుడ్ బడా సంస్థలు..

ఇక అందులో భాగంగానే దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీని ఎవరు రూపొందించారు అనే విషయానికి వస్తే, బాలీవుడ్ కి చెందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు కలసి రాజమౌళి డాక్యుమెంటరీని మోడ్రన్ మాస్టర్స్ పేరిట తెరకెక్కించారు అయితే ఈ మోడ్రన్ మాస్టర్ డాక్యుమెంటరీని రాఘవ కన్నా దర్శకత్వం వహించారు.

రాజమౌళి జీవిత కథ ఆధారంగా డాక్యుమెంటరీ రూపకల్పన..

నిర్మాణ సంస్థల విషయానికి వస్తే.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు, పలు టీవీ షోలు నిర్మించిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్. అంతేకాదు ఈ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన సంస్థ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా తెలుగు సినిమా గుర్తింపును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి పై డాక్యుమెంటరీని బాలీవుడ్ కి చెందిన సంస్థలు నిర్మించడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇకపోతే ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళికి సంబంధించిన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయని చెప్పవచ్చు. రాజమౌళి చిన్నప్పటి విశేషాలు, ప్రేమ, పెళ్లి, రాజమౌళి కెరియర్ ఆరంభం, అదే కాదు ఆయన సినిమాల గురించి కూడా చర్చించారు. అంతేకాదు ఈయనను పని రాక్షసుడు అంటూ రెబల్ స్టార్ లాంటి హీరోలు కూడా ప్రశంసించారు.

- Advertisement -

డాక్యుమెంటరీ పై స్టార్స్ స్పందన.

ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి రాజమౌళి మాత్రమే చెప్పడం కాకుండా రమా రాజమౌళి, రాజమౌళి కుటుంబ సభ్యులు , కీరవాణి కుటుంబం తోపాటు విజయేంద్ర ప్రసాద్, కాంచి, కార్తికేయ, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, హాలీవుడ్ డైరెక్టర్స్ జో రసో, జేమ్స్ కామరూన్ ఇలా చాలామంది అనేక విషయాలను మనకు తెలియజేశారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి గురించి చెప్పిన ప్రతి విషయం కూడా ఖచ్చితంగా వీక్షకులను ఆశ్చర్యాలకు గురిచేస్తుందనటంలో సందేహం లేదు.

రాజమౌళి కెరియర్..

ఇక రాజమౌళి విషయానికి వస్తే శాంతి నివాసం అనే సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి, ఆ తర్వాత ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత విక్రమార్కుడు, ఈగ , సై, మగధీర ,బాహుబలి ఇలా ఎన్నో చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు