Mogilaiah.. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి చిత్రం బలగం.. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించేలా ఉంటుంది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు జబర్దస్త్ కమెడియన్ వేణు. ఈ చిత్రంలో పాట పాడిన గాయకుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని తెలుస్తోంది.
ఆర్థిక సహాయాన్ని అర్థిస్తున్న మొగిలయ్య భార్య.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఒక పాటను మొగిలయ్యే పాడారు.. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ తెలంగాణలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఈయన చికిత్స పొందుతున్నట్లు.. ఆయన భార్య కొమురమ్మ తెలియజేసింది.. తన భర్త వైద్యానికి సహాయం కావాలి అంటూ ప్రభుత్వాన్ని సైతం వేడుకుంటున్నట్లు తెలుస్తోంది.. చికిత్సకు అవసరమైన డబ్బులు తన వద్ద లేవని.. దయచేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఆమె విన్నవించుకుంటుంది. మొగిలయ్య ఎక్కువగా తన జీవితంలో బుర్రకథలు వంటివి చెబుతూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారట.
ఆస్పత్రి పాలైన మొగిలయ్య..
తెలంగాణ ప్రాంతంలో ఉండే కొన్ని ప్రాంతాలలో ఈయన బుర్రకథలు చెప్పేవారు. అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నట్లుగా సమాచారం.. అయితే ఆ ఇల్లు పై కప్పు కూడా ఇప్పుడు పడిపోవడం వల్ల బయట చిన్న గుడారం వేసుకొని బ్రతుకుతున్నట్లు తెలుస్తోంది.. కొన్ని నెలల క్రితం ఈయన కరోనా బారిన పడ్డారు.. ఆ తర్వాత రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో వివిధ అనారోగ్య సమస్యలు కూడా ఈయనను చుట్టిముట్టాయి. ఉన్నత విద్యను చదువుకో లేకపోయిన మొగిలయ్య, కొమరమ్మ ఇద్దరు కూడా పాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు.
కేటీఆర్ కూడా సహాయం..
అయితే ఇటీవలే కేటీఆర్ కూడా తన వంతు సహాయంగా కొంత డబ్బు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజుల నుంచి మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దిగజారిపోతోంది.. ఇప్పటికి అనేక ఆపరేషన్లు కూడా జరిగినట్లు సమాచారం.. గుండె సంబంధిత సమస్య కూడా రావడంతో కేసీఆర్ ప్రభుత్వంతో పాటు బలగం మేకర్స్ కూడా కొంత ఆర్థిక సహాయాన్ని అప్పట్లో చేశారు.. మళ్లీ ఇప్పుడు అనారోగ్య సమస్యతో మొగిలయ్య ఆసుపత్రిలో జాయిన్ అవడంతో ఆయనను కాపాడాలి అంటూ ఆయన భార్య కొమురమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం వేడుకుంటోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందేమో చూడాలి మరి.
పవన్ కళ్యాణ్ సహాయం కోసం ఎదురుచూపు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాను నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పిలిపించి మరి మొగిలయ్య చేత పాట పాడించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. మరొకవైపు ఆంధ్రాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నేతగా మారిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన ఎన్నికలలో 21 స్థానాలలో 21 స్థానాలు గెలుపొంది.. పిఠాపురం ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చారు ..మరి ఇలాంటి నేతలు మొగిలయ్యకి ఆర్థిక సహాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.