Mohan Babu : ప్రభాస్ ని ఏకంగా ‘బావా’ అనేశాడేంటి.. ఎప్పుడూ లేని వరసలు దేనికోసమో?

Mohan Babu : టాలీవుడ్ లో రెండు రోజుల కింద రిలీజ్ అయిన కల్కి2898AD సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కళ్ళు చెదిరే కలెక్షన్లతో ఈ సినిమా దూసుకుపోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ హీరోలు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి యంగ్ స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండే బడా సెలెబ్రిటీలు సైతం చిత్రనటీనటుల్ని, మేకర్స్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా సీనియర్ హీరో మోహన్ బాబు కూడా కల్కి2898AD చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ వేయడం జరిగింది. అయితే ఆ ట్వీట్ టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది.

Mohan Babu called Prabhas "BAVA" while congratulating the Kalki Movie unit

 

- Advertisement -

ప్రభాస్ ని “బావా” అనేసిన మోహన్ బాబు..

ఇక కల్కి టీం ని విష్ చేస్తూ మోహన్ బాబు (Mohan Babu) వేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. చిత్ర నటీనటులను, అలాగే టెక్నికల్ టీం ని విష్ చేస్తూ మోహన్ బాబు ట్వీట్ వేసాడు. అయితే అందరు సెలెబ్రిటీలు విష్ చేస్తున్నారు, మోహన్ బాబు ట్వీట్ లో అంత స్పెషల్ ఏముంది అంటారా… అదేంటంటే.. కల్కి టీం ని విష్ చేస్తూ అందరికి పేరుపేరునా విష్ చేసిన మోహన్ బాబు ప్రభాస్ ని మాత్రం బావా అని సంబోధిస్తూ ట్వీట్ వేయడం హాస్యాస్పదంగా మారింది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. అయితే మోహన్ బాబు ఇంతకు ముందు ప్రభాస్ నటించిన బుజ్జిగాడులో శివన్న గా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో త్రిషకి అన్నగా మోహన్ బాబు నటించాడు. అంటే ఆ సినిమాలో ప్రభాస్ మోహన్ బాబు వరసకి బావ అవుతాడుగా… ఆ పాత్రని గుర్తు చేస్తూ ఇలా ప్రభాస్ ని బావా అనేసాడని తెలుస్తుంది.

ఎప్పుడూ లేని వరసలు?

అయితే ఇండస్ట్రీలో మోహన్ బాబు, ఇంకా తన వారసులు కొంతమంది స్టార్స్ ని వరసల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మోహన్ బాబు యంగ్ హీరోస్ ని బిడ్డ అంటూ, మంచు విష్ణు నా బ్రదర్, బావా, బాబాయ్ అంటూ తోటి హీరోలని పిలుచుకుంటూ ఉంటారు. అయితే అలా రెగ్యులర్ గా పిలిచే సందర్భాలు తక్కువ. గత కొంతకాలంగా మాత్రం ఇండస్ట్రీలో అందరు హీరోలతో మంచిగా ఉంటున్నారు ఈ ఫ్యామిలీ. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ ని మోహన్ బాబు బావా అని పిలవడంతో తాను నిర్మిస్తున్న కన్నప్ప మూవీకి కాస్త ప్రమోట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా చేసాడని తెలుస్తూనే ఉంది. ఇక కన్నప్పలో ప్రభాస్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడని తెలిసిందే. ఇప్పట్నుంచే ప్రభాస్ సపోర్ట్ తో తమ సినిమాకి మార్కెటింగ్ చేసుకుందామని మోహన్ బాబు ఫిక్స్ అయ్యాడని తెలుస్తూనే ఉంది. ఇక కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ మోహన్ బాబుని మా హీరోని బావా అని ఎలా అనిపించిందని అని ఫీల్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు