Mohan Babu: మోహన్ బాబు కి ఎందుకింత అహంకారం.?

Mohan Babu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఏ విధమైన రెస్పెక్ట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ ఏ సినిమా చేసినా కూడా అది పెద్దగా వర్కౌట్ కాకుండా పోయింది. వరుసగా సినిమాలు డిజాస్టర్ అవుతూ వచ్చాయి. మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాకి అయితే ఒక థియేటర్లో కేవలం రెండు టిక్కెట్లు మాత్రమే ఫెయిల్ అయ్యాయి. అయితే మంచి ఫ్యామిలీ ఎప్పుడూ డబ్బా కొట్టుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో మోహన్ బాబు మాట్లాడిన తీరు చాలా మందిని ఇబ్బంది పెట్టింది.

అలానే కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ “ఈ సినిమా కోసం దేశం నలుమూలల నుంచి ప్రముఖ నటులను ఎంపిక చేశాం. వాళ్ళు ఎలా చేశారు అని చెప్తే నేను డబ్బా కొట్టుకునట్టు ఉంటది.” అని ఒక సందర్భంలో అన్నారు. అప్పుడు మోహన్ బాబు మాట్లాడిన మాటలకు ట్రోల్స్ వచ్చాయి. డబ్బా కొట్టుకోవడం మీ ఫ్యామిలీకి కొత్త ఏమీ కాదు అంటూ మళ్ళీ తగులుకుంటున్నారు.

ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారి కంటే కూడా నేను గొప్ప నటుడిని అని మోహన్ బాబు చెప్పుకున్నారు. అలానే రజినీకాంత్ ని కూడా వాడు వీడు అనడం, అప్పుడప్పుడు నా కాళ్లు మొక్కుతాడు అని చెప్పడం. ఇవన్నీ కూడా మోహన్ బాబు పైన విపరీతమైన నెగిటివిటీని తీసుకొచ్చాయి. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు ఒక కండిషన్ పెట్టారు. తమ సినిమా టిక్కెట్ రేట్లు పెంచమని అడిగే ముందు సైబర్ క్రైమ్ గురించి అలానే డ్రగ్స్ గురించి ప్రజల్లో చైతన్యం కల్పించేలా ఒక వీడియోను చేసి ఇవ్వమని అడిగారు.

- Advertisement -

Mohan Babu

అయితే ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ వీడియోను చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాటలు పై మంచు మోహన్ బాబు స్పందిస్తూ ఇదివరకే మేము ఇలాంటి వీడియోలు చేసి ఇచ్చాము. కానీ మళ్లీ మీకోసం చేయమంటే ఏదో ఉడత సాయంగా చేసి ఇస్తామంటూ మాట్లాడారు. అయితే ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాయి. మోహన్ బాబు కి ఎందుకంత అహంకారమని కొంతమంది పర్సనల్ గా కూడా ట్రోల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు