Mohanlal : హేమ కమిటీ ఎఫెక్ట్… చేతులెత్తేసిన మోహన్ లాల్

Mohanlal.. మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా(Justice hema)కమిటీ రూపొందించిన నివేదిక ఒక్కసారిగా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే చాలామంది నటులు, డైరెక్టర్లు, నిర్మాతలపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన హేమా కమిటీ విస్తుపోయే నిజాలను తెలియజేసింది. ముఖ్యంగా మహిళల పైన క్యాస్టింగ్ కౌచ్ చాలానే జరుగుతోందనే విషయాన్ని తేల్చి చెప్పింది. సినిమాలలో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొంతమంది దర్శక నిర్మాతలు , నటులతో సన్నిహితంగా మెలగాలని ముందుగానే చెబుతున్నారట. ఇలా అన్ని విషయాలకు అంగీకరిస్తేనే సినిమాలలో అవకాశాలు వస్తాయని, ఇలాంటి వాటికి కాంప్రమైజ్ అనే పదాలను కూడా ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా హేమా కమిటీ గుర్తించిందని తెలుపుతోంది.

Mohanlal : Hema Committee effect... Star hero raised his hands..!
Mohanlal : Hema Committee effect… Star hero raised his hands..!

కేరళ ప్రభుత్వం సీరియస్ నిర్ణయం..

దీంతో సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని.. అక్కడి ప్రభుత్వం అయిన సీఎం పినరయి విజయన్ (Pinarayi vijayan)పోలీసు ఉన్నత అధికారులకు సైతం ఈ విషయాల పైన ప్రత్యేక కమిటీ వేసి ఏడుగురు సభ్యులతో ఒక టీం ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి విషయాలలో నటుడు, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన ముఖేష్(Mukhesh ) వ్యవహారం ఒక్కసారిగా తెరమీదకి రావడం జరిగింది. వీరితోపాటు డైరెక్టర్ రంజిత్ (Ranjith ), మరొక నటుడు సిద్ధిఖి (Siddhiqui) పేర్లు వినిపించడంతో వీరు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

అమ్మ కి రాజీనామా చేసిన మోహన్ లాల్..

అయితే ఇప్పుడు తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ (Mohan Lal) కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు చాలామంది ఎగ్జిక్యూట్ కమిటీ సభ్యులందరూ కూడా రాజీనామా చేశారట. ఈ కమిటీలో ఉండే కొంతమంది సభ్యుల పైన ఇలాంటి ఆరోపణలు రావడంతో కమిటీ సభ్యులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో AMMA కమిటీని సైతం రద్దు చేస్తున్నట్లు మోహన్ లాల్ తెలియజేశారు. మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయని కొత్త కమిటీ కూడా ఏర్పాటు అవుతుందని ప్రకటనలో తెలియజేశారు.

- Advertisement -

నటుడు సిద్ధిఖీపై యాక్షన్..

ముఖ్యంగా సీనియర్ నటుడు సిద్ధిఖి పైన.. నటి రేవతి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఈయన కేరళ పోలీసులకు కూడా రేవతి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం తన మీద కావాలని ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తోందని ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో తెలిపారట. అయితే హేమా కమిటీ నివేదికలో వెలువడిన విషయాలలో కాస్టింగ్ కౌచ్ లో మరి కొంతమంది నటీమణులు కూడా మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటి పైన మరిన్ని నిజాలు మరెన్ని రోజులలో వస్తాయో చూడాలి. ఇకపోతే జస్టిస్ హేమ తన నివేదికలో ఇండస్ట్రీలోకి రావాలి అంటే దర్శక నిర్మాతలు, హీరోలు అడిగిన కోర్కెలు తీర్చాలని, బెడ్ రూమ్ కి కచ్చితంగా వెళ్లాలనే విధంగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయని , వీటివల్ల చాలామంది హీరోయిన్లు ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నారని ఆమె రాసుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు