Mokshagna: మొదటి సినిమాకి ముహూర్తం ఫిక్స్.. హీరోగా లాంచ్ అయ్యేది ఆ రోజే..!

Mokshagna.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారసత్వాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే స్టార్ హీరోల అభిమానులు కూడా తమ అభిమాన హీరోల వారసులు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు మహేష్ బాబు(Mahesh Babu)తన వారసుడు ఘట్టమనేని గౌతమ్ కృష్ణ(Ghattamaneni gautham Krishna)ను , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన వారసుడైన అకీరా నందన్ (Akira Nandan)ను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నటసింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా తన కొడుకు మోక్షజ్ఞ (Mokshagna) ను ఇండస్ట్రీకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసింది.

Mokshagna: Fix the moment for the first movie.. The hero was launched on that day..!
Mokshagna: Fix the moment for the first movie.. The hero was launched on that day..!

మోక్షజ్ఞ ఎంట్రీ కి సర్వం సిద్ధం..

నిజానికి గౌతమ్ కృష్ణ , అకీరా నందన్ కంటే కూడా ఎక్కువగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు . గత రెండు మూడు సంవత్సరాలుగా అదిగో ఇదిగో అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ కి మోక్షం కలగడం లేదు. దీంతో అసలు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు బాలకృష్ణ సినీ కెరియర్లో బిగ్గెస్ట్ టైం ట్రావెల్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ వార్తలు అక్కడితో ఆగిపోయాయి.

సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ మొదటి సినిమా ముహూర్తం…

దీంతో అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కి అసలు ముహూర్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది. రామకృష్ణ స్టూడియోలో సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ మొదటి చిత్రానికి ముహూర్తం పెట్టనున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో వారసుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

బాలయ్య కెరియర్..

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. నేటితో ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ పేరిట బాలకృష్ణకు ఘనంగా సన్మానించడం కోసం చిత్ర పరిశ్రమ ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం దేశ సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు అందరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.మరొకవైపు బాలకృష్ణ రాజకీయాలలో వేగంగా దూసుకుపోతున్నారు. హిందూపురం నియోజకవర్గం నుండి ఏకంగా మూడవసారి గెలుపొంది రాజకీయాలలో కూడా హ్యాట్రిక్ అందుకున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో విజయాల పరంపర కొనసాగిస్తున్న బాలయ్య , అటు రాజకీయాలలో కూడా వేగంగా దూసుకుపోతున్నారు. మరొకవైపు తన కొడుకుని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే మోక్షజ్ఞ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది మరి డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు ? సినిమా ఏంటి? కథ కథనం ఏంటి? అనే పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మోక్షజ్ఞ లుక్ కూడా అదిరిపోయింది. గతంలో బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ నటన కోర్సులో చేరిన తర్వాత శరీరంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ హీరో చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నారు. మరి మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు