Mokshagna: మోక్షజ్ఞ న్యూ లుక్ వైరల్… ఇదేంటి ఇలా మారిపోయాడు!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, హీరోలుగా నిలదొక్కుకోవడం కూడా జరిగిపోయింది. అఖిల్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలు మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, సరైన సక్సెస్ రాక ఇంకా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నటసింహం నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీ మాత్రమే మిగిలి వుంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో బాలయ్య కొడుకు ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ప్రస్తుతం అందరి చూపూ మోక్షజ్ఞ పైనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన న్యూ లుక్ కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో మోక్షజ్ఞ షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

గత కొన్ని రోజుల దాకా బొద్దుగా కనిపించి అభిమానులను నిరాశపరిచిన బాలయ్య తనయుడు ఇప్పుడు బరువు తగ్గి మంచి ఫిట్ నెస్ మైంటైన్ చేస్తున్నాడు. తాజాగా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ చూస్తుంటే మోక్షజ్ఞ ఎంట్రీకి ఇంకా ఎక్కువ రోజులు లేదనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉంగరాల జుట్టుతో మోక్షజ్ఞ సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ పిక్ చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా రెడీ అయ్యాడని నమ్ముతున్నారు. బాలయ్య కెరీర్ ను టర్న్ చేసిన “ఆదిత్య 369” సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య స్వయంగా దగ్గరుండి తన వారసుడి మొదటి సినిమాను నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. కానీ ఇంకా ఈ విషయంలో క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే అభిమానులకు కిక్ ఇచ్చే మోక్షజ్ఞ కొత్త ఫోటో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇక మరోవైపు వారసుడు ఎంట్రీకి సిద్ధమవుతున్నప్పటికీ బాలయ్య జోరు ఇంకా తగ్గనేలేదు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబితో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ తర్వాత బాలయ్య శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ తో చేయనున్నాడని రూమర్లు నడుస్తున్నాయి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు