Mollywood Actress: నా తండ్రి వయసున్న వ్యక్తి నాపై లైంగిక దాడి చేసారు.. కట్ చేస్తే.!

Mollywood Actress.. మాలీవుడ్(Mollywood )సినీ పరిశ్రమలో నటీమణులు ఎంతలా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారో ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి చెబుతుంటే ఆశ్చర్యం వేయక మానదు. ముఖ్యంగా భావన (Bhavana)అత్యాచార ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన జస్టిస్ హేమా కమిటీ అందరికీ కునుకు లేకుండా చేస్తోంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులపై ఎవరైతే లైంగిక దాడికి దిగుతున్నారో వారిపై కఠిన చర్య తీసుకోవడానికి కేరళ ప్రభుత్వం నడుం కట్టింది. అందులో భాగంగానే చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పుకుంటున్నారు.

Mollywood Actress: A man of my father's age sexually assaulted me.. If you cut it.!
Mollywood Actress: A man of my father’s age sexually assaulted me.. If you cut it.!

యువ నటిపై ఇద్దరు నటులు లైంగిక దాడి..

ఈ క్రమంలోనే ఒక మలయాళ యువనటి బయటకు వచ్చి ఇద్దరు హీరోలు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మలయాళ నటుడు సిద్ధిఖి (Siddhiqui)పై యువ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ హీరో మా (AMMA) కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతను చెబుతున్నట్టు ఏదో ఒక విషయం గురించి మాట్లాడడానికి నన్ను పిలవలేదు. నిజానికి అతను నాపై అత్యాచారం చేశాడు .నేను స్కూల్ స్టడీస్ ఫినిష్ చేసుకోగానే నన్ను కలిశాడు అంటూ ఆమె మీడియాకు తెలిపింది.

నా తాత వయసున్న వ్యక్తి నాపై దాడి చేశాడు.

సోషల్ మీడియా పేజ్ ద్వారా అతడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. పాప అంటూ మొదట సంబోధిస్తూ మెసేజ్ పంపించారు. అయితే నేను చిన్నదానిని కావడంతో ఇలాంటి దారుణాలు ఎందుకు చేస్తారని గుర్తించలేకపోయా. మంచివాడు అనుకొని అతడు పిలిచిన వెంటనే వెళ్లిపోయాను. కానీ అతడు చేసే వికృత పనులకు ఆశ్చర్యపోయాను అంటూ తెలిపింది హీరోయిన్. ఒకరోజు నన్ను సినిమా ప్రివ్యూ కోసం పిలిస్తే నేను వెళ్ళాను. అప్పుడు నాతో ఒక సినిమా ఆఫర్ గురించి డిస్కస్ చేద్దామని ఒక హోటల్ కి రమ్మన్నాడు. ఇక నేను కూడా వెళ్ళిపోయాను. అక్కడ నా తాత వయసు ఉన్న వ్యక్తి నాపై దారుణంగా బిహేవ్ చేశాడు. లైంగికంగా దాడి చేసి, నా ముందే హస్తప్రయోగం చేసుకున్నాడు. శృంగారం చేయడానికి ఒప్పుకోకపోతే అత్యంత దారుణంగా నన్ను చిత్రవధ చేశాడు. ఇక అతడి చేష్టలు చూసి భయపడిపోయాను ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూశాను. కానీ ఎవరు రాలేదు దాంతో ఎట్టకేలకు అతడి నుంచి తప్పించుకొని బయటపడ్డాను.

- Advertisement -

లొంగలేదని బెదిరించారు..

నా తల్లిదండ్రులను నా జీవితంలో చూస్తానో లేదో అనే భయం ఏర్పడింది. దాదాపు గదిలో బంధించినంత పని చేసారు నన్ను అంటూ మీడియాకు చెప్పుకొచ్చింది.నీ అంత చూస్తాను.. మీడియాకు చెబుతాను అని నేనంటే.. నీ దిక్కున్న చోట చెప్పుకో ..నువ్వు చెప్పే మాటలు ఎవరూ నమ్మరు.. అసలు నువ్వు ఏమైనా సినిమాలలో నటించావా అంటూ నన్ను ప్రశ్నించాడు. అప్పుడు నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. ఇలాంటి దారుణాలు ఎదురైనా నటి కావాలనే ఆశ నాలో ఇంకా చావలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆ యువనటి. ఇకపోతే సిద్ధికి పై ఆరోపణలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అతడు తాజాగా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు