Mollywood Actress: టచ్ చేస్తూ టార్చర్ చేశాడు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Mollywood Actress.. మలయాళ చిత్ర పరిశ్రమ.. యావత్ దేశ సినీ పరిశ్రమ దీని వైపే చూస్తోంది. ఎప్పుడైతే జస్టిస్ హేమా (Justice Hema) కమిటీ నివేదిక సమర్పించిందో , ఆ నివేదిక తర్వాత ఒక్కొక్క హీరోయిన్ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నిర్భయంగా బయటకి చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళ నటి పార్వతీ మాలా (Mala Parvathi) కూడా స్పందించారు.

Mollywood Actress: Touching and Tortured.. Heroine's Comments Viral..!
Mollywood Actress: Touching and Tortured.. Heroine’s Comments Viral..!

అనవసరంగా టచ్ చేసి ఇబ్బంది పెట్టాడు..

మాలా పార్వతి మాట్లాడుతూ.. 2010లో నేను అపూర్వ రాగం సినిమా చేశాను. ఈ సినిమాలో నా కూతురు న్యాన్సీ క్యారెక్టర్ లో నిత్యామీనన్ (Nithyamenon )నటించింది. ఈ కథ నా చుట్టూ, నా కూతురు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నేను నా కూతురు సరదాగా తిరుగుతూ ఆడుకునే సీన్ అది. ఆ సమయంలో నా భర్త క్యారెక్టర్ లో నటించిన ఒక వ్యక్తి న్యాన్సీని ఆప్యాయంగా టచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఒక చేత్తో నాన్సీని టచ్ చేస్తూనే.. మరొక చేత్తో అనవసరం అయినప్పటికీ కూడా నన్ను బలంగా తాకాడు. ఇక ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ శిబీ మలైయిల్ టచ్ లేకుండా ఈ సన్నివేశాన్ని మరొకసారి రీ టేక్ చేశారు.

ఆ సినిమా నాకు టార్చర్ లా అనిపించింది..

అయితే అదే వ్యక్తితో ఒకరి పక్కన మరొకరు కూర్చోవడం, హత్తుకోవడం వంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఆ సినిమా నాకు ఒక టార్చర్ లాగా అనిపించింది. మానసికంగా , శారీరకంగా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఆ సినిమాలో సరిగ్గా కూడా నటించలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మాల పార్వతి. ఇదంతా కూడా ఈమె ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

- Advertisement -

కొందరి వ్యక్తుల వల్ల మలయాళ ఇండస్ట్రీ పాడైపోయింది..

అంతేకాదు తన జీవితంలో జరిగిన మరో ఘటన గురించి తెలిపింది మాలా పార్వతి. 2019లో హ్యాపీ సర్దార్ అనే సినిమాలో నేను నటించాను. అయితే ఈ సినిమా సమయంలో నా కోసం నేను నా ఖర్చుతో క్యారవాన్ కూడా పెట్టుకున్నాను. అయితే ఆ క్యారవాన్ కి నేనెలా అర్హులాలిని అంటూ ఒక సీనియర్ నటుడు ప్రశ్నించాడు. నా సొంత డబ్బుతో నేను పెట్టుకున్నానని చెప్పినా సరే అతని వైఖరి మారలేదు. ఒకరోజు అనుకోకుండా రాత్రివేళ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ క్యారవాన్ దగ్గర అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి అంటూ చెప్పారు. నేను హడావిడిగా వెళ్లాను . అయితే అక్కడ నా క్యారవాన్ కనిపించలేదు. దగ్గర్లో ఒక చెట్టు కింద పార్క్ చేసి ఉందని నేను గమనించాను. అక్కడికి వెళ్తుంటే ఇద్దరు బౌన్సర్స్ నన్ను చూసి పారిపోయారు. అయితే అక్కడే ఉన్న అమ్మాయిలను నేను తీసుకొచ్చాను.

హ్యాపీ సర్దార్ సినిమా నా జీవితాన్ని నాశనం చేసింది..

ఈ భయంకరమైన సంఘటన గురించి నేను మలయాళ నటుడికి ఫిర్యాదు చేస్తే.. అతడేమో నువ్వు సామాజిక కార్యకర్తలా వచ్చావా లేక నటించడానికి వచ్చావా అంటూ నన్నే ప్రశ్నించాడు. ఇలాంటి వారి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చే మహిళలకు భద్రత లేకుండా పోయింది అంటూ తెలిపింది. ఒక రకంగా చెప్పాలి అంటే హ్యాపీ సర్దార్ సినిమా నా నటన జీవితాన్ని నాశనం చేసింది. న్యాయం కోసం నా గొంతును వినిపించడం వల్ల నాకు అవకాశాలు తగ్గిపోయాయి అంటూ ఆమె తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు