Mollywood : ‘ఓర్మాక్స్ మీడియా’ సంస్థ టాప్ హీరోయిన్ లిస్ట్

Mollywood: అన్ని సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఓర్మాక్స్ మీడియా’ (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, హీరోయిన్లు ఎవరు అనేది జాబితాను ప్రకటించింది. ఈ సంస్థ 2010 నుంచి ప్రతి నెల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. ఇకపోతే కొంతమంది హీరోయిన్స్ పాపులారిటీలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ప్రస్తుతం ఫస్ట్,సెకండ్,థర్డ్ స్థానాలను ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఓర్మాక్స్ మీడియా అనే కన్సల్టింగ్ సంస్థ ప్రతి నెలా అత్యంత ప్రజాదరణ పొందిన సినీ తారల జాబితాను విడుదల చేసినట్లే ఇప్పుడు కూడా విడుదల చేసింది.

Mollywood: 'Ormax Media' Company Top Heroine List
Mollywood: ‘Ormax Media’ Company Top Heroine List

సెకండ్ ప్లేస్ సర్ ప్రైజ్ ఎంట్రీ
ఇప్పుడు ఓర్మాక్స్ మీడియా ఏప్రిల్ నెలకు సంబంధించిన మలయాళ సినిమా ప్రముఖ తారల జాబితాను విడుదల చేసింది. అది కూడా మలయాళ నటీమణులదే. శోభన సహా సీనియర్‌ ప్లేయర్‌లను పక్కనబెట్టి ఓ యంగ్‌ స్టార్‌ ముందుకు రావడం విశేషం. మంజు వారియర్ ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. ఈసారి కూడా ఎలాంటి మార్పు లేకుండా మంజు మొదటి ప్లేస్ లో ఉన్నారు . ఇటీవలి కాలంలో కొత్త సినిమాలేవీ విడుదల కాకపోయినా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుకుంది మంజు. సెకండ్ ప్లేస్ సర్ ప్రైజ్ ఎంట్రీ. ప్రేమలు సినిమాతో ఇతర భాషల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మమితా బైజు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సినిమాలో మమిత నటనకు ప్రశంసలు దక్కాయి.

ఐదవ స్థానంలో కళ్యాణి ప్రియదర్శన్
ఈ లిస్ట్ లో శోభన మూడో స్థానంలో ఉన్నారు. శోభన కొత్త సినిమా మోహన్‌లాల్‌తో చేస్తున్నారు. పక్కనే ఐశ్వర్యలక్ష్మి కూడా ఉంది. ఐశ్వర్య నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో కళ్యాణి ప్రియదర్శన్ ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత కల్యాణి నటించిన సినిమా తాజాగా విడుదలైంది. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు