2024: మోస్ట్ అవైటెడ్ మూవీస్.. ఫ్యాన్స్ కి పండగే..!

2024:  మరో రెండు రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానున్న నేపథ్యంలో సినిమా లవర్స్ పాన్ ఇండియా సినిమాల పైన అంచనాలను పెంచుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే కొత్త చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. 2024 దక్షిణాది సినీ చరిత్ర లో ఒక మైలురాయిగా ఉండిపోనుంది. అలాగే వచ్చే ఏడాది అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమాలే అని మేకర్స్ కూడా భావిస్తున్నారు. మరి రాబోయే ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

పుష్ప 2:

Most Awaited Movies of 2024 ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో 2021లో పుష్ప సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం అల్లు అర్జున్ అభిమానులే కాదు యావత్ పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన పుష్ప2 విడుదల కానుంది.

- Advertisement -

గుంటూరు కారం:

Most Awaited Movies of 2024 ..
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోయే సినిమా గుంటూరు కారం.. 2021 లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ కొన్ని అవాంతరాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో రమ్యకృష్ణ, మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రకాష్ రాజ్ , జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

దేవర:

Most Awaited Movies of 2024 ..
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది.

గేమ్ ఛేంజర్

Most Awaited Movies of 2024 ..
డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల కానుంది.

కల్కి 2898 ఏడి:

Most Awaited Movies of 2024 ..
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

వీటితోపాటు సూర్య నటిస్తున్న కంగువ , కమలహాసన్ నటించిన భారతీయుడు 2, విక్రమ్ నటిస్తున్న తంగలాన్ చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం కానున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు