Ravi teja : రవితేజ మూవీస్ లో ఈ కామన్ పాయింట్ మాత్రం కామన్… గమనించారా?

Ravi teja

హీరోలు సాధారణంగా తాము నటించే సినిమా సినిమాకూ మధ్య వైవిధ్యత ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడూ ఒకే కంటెంట్ తో వస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టడం ఖాయం. అందుకే కంటెంట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అప్పుడే నటనలో తమకున్న టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం దక్కుతుంది. అలాగే ప్రేక్షకుల ఆదరణ అందుతుంది. కానీ తాజాగా సీనియర్ హీరో రవితేజ విషయంలో మాత్రం దాదాపు 6 సినిమాల్లో ఒకే కామన్ పాయింట్ కామన్ గా కనిపిస్తోంది. మరి ఈ విషయాన్ని మీరు గమనించారా?

తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజంతో, అద్భుతమైన కామెడీ టైమింగ్, ఎనర్జీతో స్టార్ హీరోగా కొనసాగుతున్న సీనియర్ నటుడు రవితేజ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఇప్పుడు మాస్ మహా రాజాగా తనకంటూ ఒక ప్రత్యేక వర్గం అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. హిట్టు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజ రీసెంట్ గా “ఈగల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ క్రియేట్ చేయని ఈ మూవీ రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ గా మిగిలిపోనుంది. ఇక కలెక్షన్ల విషయాన్ని పక్కన పెడితే కంటెంట్ లో మాత్రం ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. “ఈగల్”లో ఆయన గత సినిమాల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే హీరోయిన్ చనిపోవడం. “ఈగల్” సినిమాలో హీరోయిన్ కావ్య థాపర్ చనిపోతుంది. గతంలో రవితేజ నటించిన షాక్, వీర, డిస్కో రాజా, బలుపు, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో కూడా ఇలాగే జరుగుతుంది.

“షాక్” సినిమాలో జ్యోతిక, “వీర” మూవీలో కాజల్ అగర్వాల్, “బలుపు” సినిమాలో అంజలి, “డిస్కో రాజా’ మూవీలో పాయల్, “టైగర్ నాగేశ్వరరావు”లో నుపూర్ సనన్ చనిపోతారు. తాజాగా “ఈగల్”లో కావ్య కూడా ఇంతే. అయితే ఈ హీరోయిన్లు అందరూ కూడా ఫ్లాష్ బ్యాక్ లోనే చనిపోవడం గమనార్హం. వాళ్లు చనిపోయిన తర్వాతనే రవితేజ పగ తీర్చుకోవడం వంటివి స్టార్ట్ చేస్తాడు. మరి రవితేజ ఈ రొటీన్, సేమ్ కంటెంట్ తో ఎందుకు సినిమాలు చేస్తున్నారో ఆయనకే తెలియాలి. వరుస డిజాస్టర్లు చవి చూస్తున్నప్పటికీ రవితేజ సినిమాల కంటెంట్ మాత్రం మారడం లేదు. మరి రవితేజ నెక్స్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్” అయినా కొత్తగా ఉంటుందేమో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు