Animal Movie: బోల్డ్ బ్యూటీ త్రిప్తి బాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ వైలెంట్ మూవీ “యానిమల్” డిసెంబర్ 1న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మిక్స్డ్ రెస్పాన్స్ ను మూట కట్టుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అందరికీ ఈ మూవీతో మంచి క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో జోయా అనే పాత్రలో కనిపించిన త్రిప్తి గురించి యూత్ ఎక్కువగా వెతుకుతున్నారు. అసలు ఆమె ఎవరు? ఇన్నాళ్లు ఈ బ్యూటీ ఎక్కడుంది? అనే విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. “యానిమల్” మూవీలో కీలక పాత్ర పోషించిన త్రిప్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిప్తి ఉత్తరాఖండ్‌లో పుట్టి పెరిగింది, ముంబైకి వచ్చి కొంతకాలం మోడల్‌గా పనిచేసింది. ఆమె అనేక యాడ్స్ లో కూడా కనిపించింది ముఖ్యంగా సంతూర్ మమ్మీగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత 2017లో ‘పోస్టర్ బాయ్స్’ అనే హిందీ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. దీనికి శ్రేయాస్ తల్పాడే దర్శకత్వం వహించారు. సన్నీ డియోల్, బాబీ డియోల్, సోనాలి కులకర్ణి వంటి నటీనటులు నటించారు. ఆ తర్వాత 2018లో ‘లైలా మజ్ను’ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

దీనికి సాజిద్ అలీ దర్శకత్వం వహించారు. దీనిలో ఏక్తా కపూర్, ప్రీతి అలీ నిర్మించారు. విచిత్రమేమిటంటే, 2016లో తాను మొదటిసారి ఆడిషన్‌కు వచ్చినప్పుడు ఈ చిత్రం కోసం తిరస్కరించబడ్డానని, అయితే మళ్లీ అదే పాత్రకు తనను ఎంపిక చేశారని త్రిప్తి చెప్పింది. అయితే ఆ రెండు సినిమాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టలేదు. కానీ 2020లో ఆమె హీరోయిన్ గా నటించిన “బుల్ బుల్” అనే హార్రర్ మూవీ త్రిప్తికి మంచి క్రేజ్ తీసుకురావడంతో పాటు పలు అవార్డులు కూడా వరించేలా చేసింది.

- Advertisement -

ఈ మూవీలో నటనకు గానూ త్రిప్తికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కానీ వీటన్నింటికీ మించి “యానిమల్” ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఆమె ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు “యానిమల్”కు ముందు తరువాత అనేంత పాపులారిటీ సంపాదించుకుంది త్రిప్తి.

“యానిమల్” తర్వాత త్రిప్తి డిమ్రీకి ఆఫర్ల వర్షం కురుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో “మేరే మెహబూబ్ మేరే సనమ్‌”లో అనే మూవీ చేస్తోంది. ఇక తెలుగులో కూడా బడా ప్రొడ్యూసర్లు ఈ బ్యూటీని భారీ ప్రాజెక్టులలో భాగం చేసి ఆమెకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. తమిళంలోనూ త్రిప్తిని ఆఫర్లు వరించే అవకాశం ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు