Sampoornesh Babu : ఊరు పేరు తెలియని హీరో… సంపును అవమానించిన ప్రొడ్యూసర్..

Sampoornesh Babu : సినిమా ఇండస్ట్రీలో అందానికి ప్రాధాన్యత ఉంటుంది.. హీరోయిన్ లేదా హీరో అందంగా ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయని ఒకప్పుడు అనుకోవడం సహజం.. ఇక అందంగా ఉండేవాళ్లే సినిమాల్లో ట్రై చేసేవారు. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు టాలెంట్ ను నమ్ముకొని చాలామంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులో సంపూర్ణేశ్ బాబు కూడా ఒకరు.. ఈయన అందంగా లేనని ఎప్పుడూ అనుకోలేదు.. తన టాలెంట్ తో తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించి హీరోగా అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. అలాంటి వ్యక్తిని ఓ తెలుగు నిర్మాత దారుణంగా అవమాణించినట్లు తెలుస్తుంది.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..

సంపూర్ణేశ్ బాబు హృదయ కాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన నటనతో తెలుగు ఆడియన్స్ తో ఈలలు వేయించుకున్నాడు. నువ్వు హీరోనా అన్నవాళ్ళతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు.. అలాంటి వ్యక్తిని తెలుగు సినీ నిర్మాత SKN దారుణంగా అవమానించాడు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల జరిగిన ఫిలింఫెర్ అవార్డులలో బేబీ సినిమాకు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత SKN ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు..

Movie producer skn who insulted Sampuranesh Abbu
Movie producer skn who insulted Sampuranesh Abbu

ఈ క్రమంలో ఓ వ్యక్తి బేబీ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ పెద్దగా హిట్ సినిమాలు చెయ్యలేదు. అందులో ఫేమస్ హీరోలతో కూడా సినిమా చెయ్యలేదు. ఆయన మీద మీకు ఎలా నమ్మకం కలిగిందని అడగ్గా.. దానికి ఆయన సమాధానం చెబుతూ.. ఊరు పేరు తెలియని హీరో సంపూర్ణేశ్ బాబునే పెట్టి సినిమా చేశాడు. అది మంచి హిట్ టాక్ ను అందుకుంది. అందుకే అతన్ని నమ్మాను అని చెబుతూ సంపును దారుణంగా అవమానించాడు. ఈ మీట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవ్వడంతో నిర్మాతపై సినీ అభిమానులు మండిపడుతున్నారు. కొంచెం కూడా బుద్దిలేదు మీకు మీకన్నా సంపూర్ణేశ్ బాబునే ఎన్నో రెట్లు మేలు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై నిర్మాత ఎలా వివరణ ఇస్తారో చూడాలి…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు