Movie Theater : 4డీ ఎఫెక్ట్… మూవీ చూస్తుండగా కుప్పకూలిన సీలింగ్..!

Movie Theater.. ఈమధ్య కాలంలో సినిమా థియేటర్లు.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరింత అందంగా ముస్తాబవుతున్న విషయం తెలిసిందే.. సరికొత్తగా భిన్నంగా ప్రేక్షకులను అలరిస్తూ చూపరులను ఆకట్టుకునే రేంజిలో థియేటర్లను తీర్చిదిద్దుతున్నారు నిర్వాహకులు.. ముఖ్యంగా థియేటర్లలో వేసే బొమ్మలు 3D , 4D ఎఫెక్ట్లను కలిగిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటిని చూస్తే నిజంగా అక్కడ అది ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది.. మరొకసారి అక్కడ నిజంగా జరిగినా ఇది 4 D ఎఫెక్ట్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. అయితే నిజంగా ఇక్కడ ఒక థియేటర్లో జరిగిన సంఘటన చూసి మొదట చూసినవారు 4 D ఎఫెక్ట్ అనుకున్నారు.. తర్వాత అది నిజంగా జరిగిందని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

4D ఎఫెక్ట్ అదుర్స్…

Movie Theater : 4D effect... The ceiling collapsed while watching the movie..!
Movie Theater : 4D effect… The ceiling collapsed while watching the movie..!

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక థియేటర్లో జరిగిన విషయం ఇది.. ఇక అసలు విషయంలోకెళితే స్క్రీన్ పై సినిమా రాగానే అరుపులు కేకలతో ప్రేక్షకులు థియేటర్ ను తమ కేకలతో హోరెత్తించారు.. స్క్రీన్ పైన కనిపించే సన్నివేశాలతో కింద వీక్షిస్తున్న ప్రేక్షకులు అందులో మునిగిపోగా.. పైనుంచి సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.. అయితే ఆ సీలింగ్ గ్లాస్ అద్దాలతో చాలా అందంగా ముస్తాబు చేయడంతో మొదట వెనకనుంచి చూసిన వారంతా అక్కడేదో 4d ఎఫెక్ట్ అంటూ అనుకున్నారు ..కానీ ఒక్కసారిగా ఆ సీలింగ్ మొత్తం కూలి కింద ఉన్న ప్రేక్షకుల మీద పడడంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తోంది.. ఈ వీడియో చూసిన చాలా మంది ట్రోల్స్ చేసేస్తున్నారు. వీడియో చూడగానే మనకు కూడా ఇది 4D ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది.. కానీ వీడియో ఎండ్ అయ్యేసరికి నిజంగా అక్కడ సీలింగ్ కుప్పకూలడం కాస్త భయానకానికి గురిచేస్తుంది.. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరికీ ఏమీ కాకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజెన్లు 4d ఎఫెక్ట్ సూపర్ గా ఉంది అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్స్ కామెంట్స్ వైరల్..

సాధారణంగా మనం థియేటర్ కి వెళ్లినప్పుడు అక్కడ సినిమాలో సన్నివేశాలను బట్టి ఆ హీరో అభిమానులు సీట్లను విరగొట్టడం, చించేయడం, నిప్పు పెట్టడం లాంటిది సహజంగా చేస్తూ ఉంటారు.. అయితే ఒక్కొక్కసారి పాత థియేటర్లు మరమ్మత్తులు లేక ఇలా సడన్గా జరుగుతూ ఉంటాయి.. కానీ ఇక్కడ ఒక పెద్ద సినిమా థియేటర్లో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసినా.. మొదట చూడడానికి 4 D లాగా అనిపించి.. అందరికీ ఫన్నీగా అనిపిస్తోంది..ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తోంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు.. ఒక నెటిజన్ చాలా భయంకరంగా ఉంది ..కానీ ఫోర్ డి ఎఫెక్ట్ అనుకోని భ్రమపడ్డాను అంటూ కామెంట్ చేయగా.. మరొక నెటిజన్ భగవంతుడా ఇంతటి కామెడీ ఎక్కడ జరగకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు