Movies Rejected by Jr NTR : ఎన్టీఆర్ తన కెరీర్‌లో రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ సినిమాలివే

Movies Rejected by Jr NTR : ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పాన్ ఇండియా మూవీ లవర్స్ నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు తారక్. అయితే అంతకంటే ముందే తన సినిమాలతో టాలీవుడ్ లో యంగ్ టైగర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీసును షేక్ చేశాడు. అయితే ఈ ప్రయాణంలో అందరు స్టార్స్ లాగా తారక్ కూడా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అందులో కొన్ని ఇతర హీరోల దగ్గరకు వెళ్ళి బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి. మరి డేట్స్ ఇష్యూ కారణంగానో లేక కథ నచ్చకో తారక్ వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.

DIL

దిల్ (2003)

దిల్ సినిమా ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్. కానీ, ఆ టైంలో సింహాద్రి షూటింగ్‌లో ఉండటం వల్ల రిజెక్ట్ చేశాడు. దీంతో ఆ మూవీ మరో యంగ్ హీరో నితిన్ చేతికి దక్కింది. ఈ మూవీ నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందన్న విషయం తెలిసిందే. 2003లో రిలీజ్ అయిన దిల్ మూవీతోనే నిర్మాతగా దిల్ రాజుకు కూడా మంచి పేరు వచ్చింది. మరి ఈ మూవీని ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేదో !

- Advertisement -

Watch Aarya (Telugu) (Telugu) Full Movie Online | Sun NXT

ఆర్య (2004)

ఆర్య స్టోరీ ముందు తారక్ వద్దకే వెళ్లింది. కానీ అప్పుడు తారక్ కాస్త లావుగా ఉండేవాడు. తనకు ఈ లవ్ స్టోరీ సెట్ అవ్వదని అనుకున్నాడట. దీంతో అల్లు అర్జున్ ఈ మూవీ చేసి భారీ హిట్ కొట్టాడు. ఈ మూవీ అల్లు అర్జున్ కు స్టార్ స్టేటస్ ఇవ్వగా, డైరెక్టర్ గా సుకుమార్ కెరీర్ ను కూడా మార్చేసింది.

Prime Video: Bhadra

భద్ర (2005)

భద్ర మూవీ స్టోరీని ముందుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్‌కు బోయపాటి వినిపించారట. కానీ వాళ్లు రిజెక్ట్ చేయడంతో రవితేజ వరకు వచ్చింది. ఈ మూవీ రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. మ్యూజికల్ గా కూడా భద్ర మూవీ ఆకట్టుకుంది.

Prime Video: Kickకిక్ (2009)

కిక్ స్టోరీ ముందుగా జూనియర్ కే వినిపించారట. కానీ, అప్పుడు అదుర్స్ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రిజెక్ట్ చేశారట. అయితే ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్టే కావడం విశేషం. అదుర్స్ మూవీ ఎన్టీఆర్ కెరీర్లోనే కల్ట్ హిట్ అని చెప్పవచ్చు. అలాగే మరోవైపు కిక్ కూడా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హిట్ గా నిలిచింది.

Prime Video: Srimanthudu - Telugu

శ్రీమంతుడు (2015)

మహేష్ బాబు ఆల్ టైం హిట్స్‌లో శ్రీమంతుడు ఒకటి. ఈ స్టోరీని తారక్ కు ఫస్ట్ వినిపించారట కొరటాల శివ. కానీ అప్పటికే రభస డిజాస్టర్‌తో ఉన్న ఎన్టీఆర్ నెక్ట్స్ మాస్ మూవీ చేయాలని అనుకున్నారట. అందుకే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రిజెక్ట్ చేశారట.

The Happy Zen : Oopiri - Telugu Movie Reviewఊపిరి (2016)

నాగార్జున – కార్తీల ఈ మల్టీ స్టారర్ కూడా ఫస్ట్ తారక్ వద్దకే వచ్చిందట. దీనిలో కార్తీ పాత్ర కోసం ఎన్టీఆర్‌ను సంప్రదించారట. కానీ నాగార్జున కాళ్లు పట్టుకునే సీన్స్ వల్ల.. అభిమానుల గురించి ఆలోచించి రిజెక్ట్ చేశారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు