Mr Bacchan : ఫ్యాన్స్ కి షాకిచ్చిన మేకర్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్?

Mr Bacchan : మాస్ మహారాజ్ రవితేజ నటించిన “మిస్టర్ బచ్చన్” సినిమా ఈ ఆగస్టు 15న రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగష్టు 15న భారీ ఎత్తున మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవుతుండగా, చిత్ర యూనిట్ కూడా నాన్ స్టాప్ గా భారీగా ప్రమోషన్లు చేస్తూ, సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇక ఆల్రెడీ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి బజ్ ని తీసుకురాగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే తన మార్క్ ప్రమోషన్లతో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఇక ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ నుండి ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా, ఆగష్టు 7న ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది.

Mr Bacchan trailer launch event cancelled

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్?

ఇక రవితేజ హరీష్ శంకర్ కాంబో మూవీ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ హైదరాబాద్ AAA సినిమాస్ లో గ్రాండ్ గా సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్లాన్ చేసారు. కానీ అనూహ్యంగా ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ఇప్పుడు ఆగిపోయినట్టుగా, మిస్టర్ బచ్చన్ ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఈ ఈవెంట్ ని నిలిపివేసామని, దయచేసి అభిమానులు అర్ధం చేసుకోగలరు అంటూ, ఆ ఈవెంట్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. దీంతో టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానులు షాక్ అయ్యారు.

- Advertisement -

ట్రైలర్ లాంచ్ ఉందా లేదా?

అయితే మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ అయినందుకు అభిమానులు అంతగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదని, ఫ్యాన్స్ ని మాత్రం డిస్సపాయింట్ అవకుండా చూస్తారని సమాచారం. ఎందుకంటే, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే ఆగింది, కానీ యూట్యూబ్ లో మాత్రం ఆన్ టైం లో సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి ట్రైలర్ విడుదల కావడం పక్కా అని సమాచారం. మరి ఈ ట్రైలర్ లాంచ్ కి డిస్సపాయింట్ అయిన రవితేజ ఫ్యాన్స్ మాస్ ట్రైలర్ ని చూసి ఖుషి అవుతారేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్ గా నిర్మించారు. బాలీవుడ్ రైడ్ కి రీమేక్ గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ పూర్తిగా తెలుగు నేటివిటి ప్రకారం చాలా మార్పులు చేసారని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు