Mr Bacchan : మిస్టర్ బచ్చన్ ఫైనల్ బ్లాస్ట్ కి టైం ఫిక్స్..

Mr Bacchan : టాలీవుడ్ లో కల్కి2898AD సినిమా తర్వాత మరో పెద్ద సినిమా రాలేదు. అయితే ఇప్పుడు ఆగష్టు 15న రెండు క్రేజీ తెలుగు బడా సినిమాలు రిలీజ్ అవుతుండగా, అందులో మాస్ మహారాజ్ రవితేజ నటించిన “మిస్టర్ బచ్చన్” సినిమా కూడా ఒకటి. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగష్టు 15న భారీ ఎత్తున మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవుతుండగా, చిత్ర యూనిట్ కూడా నాన్ స్టాప్ గా భారీగా ప్రమోషన్లు చేస్తూ, సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇక ఆల్రెడీ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి బజ్ ని తీసుకురాగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే తన మార్క్ ప్రమోషన్లతో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఇక ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ నుండి ఫైనల్ బ్లాస్ట్ కి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది.

Mr Bacchan Trailer Reelase date Announced

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..

ఇక రవితేజ ఫ్యాన్స్ కూడా మాంచి ఆకలి మీదుండగా, మిస్టర్ బచ్చన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మాస్ మహారాజ రవితేజను పర్ఫెక్ట్ మాస్ అవతార్ లో చూపించే దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఇక మాస్టర్ బచ్చన్ నుండి ఇప్పటికే రిలీజైన టీజర్, ప్రోమోలు కిక్కెక్కించగా, ఇప్పుడు ఫైనల్ గా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసారు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ని ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో హీరోహీరోయిన్లు ఇద్దరూ కౌగలించుకొని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు.

- Advertisement -

మిస్టర్ బచ్చన్ తో రవన్న కం బ్యాక్ ఇచ్చేనా?

ఇక మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమా తో మాస్ మహారాజ రవితేజని కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చూడాలని భావిస్తున్న ఫ్యాన్స్ కి ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుందని హరీష్ శంకర్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ట్రైలర్ ఆగష్టు 7న సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించడం విశేషం. ఇక వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు