Mr Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమాపై ప్లాన్ చేసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారా.?

Mr Bachchan: హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన రైడ్(Raid) సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ కానీ రీమేక్ సినిమాలను ఎంటర్టైన్మెంట్ వే లో డీల్ చేయగల సామర్థ్యం హరీష్ శంకర్(Harish Shankar) కి ఉంది కాబట్టి చాలామంది ఈ సినిమా మీద మంచి నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. మిక్కీ జే మేయర్ అందించిన సాంగ్స్ ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి.

ఈ సినిమాను ఆగస్టు 15 సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు ముందు మంచి పాజిటివ్ టాక్ ఉంటుంది. ప్రీమియర్ షో పడినప్పుడు కూడా పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమాకి సంబంధించి టీజర్ ట్రైలర్ అన్ని కూడా ఈ సినిమా పైన మంచి బజ్ క్రియేట్ చేసేయ్. ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో కంప్లీట్ అయ్యే టైంకి నెగెటివ్ టాక్ కూడా స్టార్ట్ అయింది. ఉన్నపలంగా ఉన్న పాజిటివ్ టాక్ అంతా నెగిటివ్ గా మారిపోయింది. ఇదంతా కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారా అనే అనుమానాలు కూడా వచ్చాయి.

Harish Shankar

- Advertisement -

ఈ సినిమాకు సంబంధించి హరీష్ శంకర్ కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఇంతకుముందు తన సినిమాలకు ఎప్పుడూ లేనివిధంగా చాలా మందితో మాట్లాడాడు. ట్విట్టర్లో ప్రతి పోస్ట్ షేర్ చేయడం మొదలుపెట్టాడు. ఇక రవితేజ(Ravi Teja)లో ఎప్పటినుంచో మిస్సయిన ఎనర్జీని ఈ సినిమాతో బయటికి తీస్తాడు అంటూ చాలామంది ఊహించారు. కానీ అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. అనవసరమైన కామెడీ ట్రాక్ తో ఈ సినిమా ఏటేటో వెళ్లిపోయింది. హరీష్ ని సినిమాకి ముందు ఎంతమంది పొగిడారు సినిమా తర్వాత అంతకుమించి ట్రోల్ చేశారనేది వాస్తవంగా జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు