Mr.Bachchan: రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పుడే..?

Mr. Bachchan.. మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిమానుల ఎదురుచూపుకు తెరదించుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడేకంగా విడుదల తేదీనీ ఖరారు చేసి పోస్టర్ తో సహా రిలీజ్ చేసేసరికి అభిమానుల ఆనందాలకు అవధులు లేవని చెప్పవచ్చు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారిక పోస్టర్ తో మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Mr.Bachchan: Fix the release date.. will it come then..?
Mr.Bachchan: Fix the release date.. will it come then..?

మిస్టర్ బచ్చన్ విడుదల తేదీ లాక్..

ప్రముఖ హీరో రవితేజ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ప్రీమియర్స్ ఆగస్టు 14వ తేదీన ప్రదర్శించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం పోస్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ అభిమానిగా రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. నిజాయితీ కలిగిన ఆదాయపు పన్ను అధికారిగా ఇందులో రవితేజ నటిస్తున్నారని ప్రచార చిత్రాలు చూస్తే మనకు అర్థమవుతుంది.

సినిమా కథ..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నిజాయితీ గల ఆదాయపు అధికారి ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్ కు వెళ్తాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది సినిమా కథాంశం.

- Advertisement -

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ బోర్సే..

మొదటిసారి ప్రముఖ యంగ్ బ్యూటీ క్యాడ్బరీ యాడ్ తో భారీ క్రేజ్ దక్కించుకున్న భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో విలన్ గా జగపతిబాబు నటిస్తుండగా.. సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో అవకాశం దక్కించుకున్న తర్వాత ఇప్పటికే నాలుగు, ఐదు సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా విడుదల కాకముందే వరుస ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయంటే ఇక ఈ సినిమా విజయం సాధిస్తే ఈమెకు అవకాశాలు వెల్లువడతాయని చెప్పవచ్చు.

ముచ్చటగా మూడోసారి..

ఇకపోతే ఇప్పటికే హరీష్ – రవితేజ కాంబినేషన్లో షాక్, మిరపకాయ వంటి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి కూడా కారణం లేకపోలేదు. అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా సినిమా వాయిదా పడుతూ డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేశారు. అలాగే డబుల్ ఇస్మార్ట్ టీం కూడా డేట్ వాయిదా వేసుకుంది. ఇక ఇప్పుడు ఆ డేట్ ను రవితేజ ఫిక్స్ చేసుకున్నారు. ఇక అదే రోజు తంగలాన్ చిత్రం కూడా బాక్సాఫీస్ ముందుకి రానంది. మరి ఈ సినిమాలు ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు