Mr Bachchan: డాన్స్ మూమెంట్ పై స్పందించిన హరీష్ శంకర్

Mr Bachchan: హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. హరీష్ శంకర్ కి రీమేక్ సినిమాలను అద్భుతంగా డీల్ చేస్తాడు అని ఒక మంచి ఇమేజ్ ఉంది. హరీష్ కెరియర్ లో కూడా అలాంటి సినిమాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఒరిజినల్ కంటెంట్ లోని అంశాన్ని మాత్రమే తీసుకొని తనదైన శైలిలో మార్పులు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటూ ముందు నుంచి చెబుతూ వచ్చారు.

ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాకి మిక్కీ అందించిన నాలుగు పాటలు కూడా అద్భుతమైన హిట్ అయ్యాయి. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ పాటలు పెంచాయి. ఆగస్టు 15 ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాకుతో కొనసాగుతుంది. ఇకపోతే ఈ సినిమాలో సితార అనే పాట ఎంత పెద్దగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలోని ఒక మూమెంట్ చర్చనీయాంశమైంది. దానికి హరీష్ శంకర్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. పాటను పాటగా చూసినప్పుడు అది పెద్దగా అనిపించదు కానీ స్క్రీన్ షాట్ కొట్టి చూస్తే అది కొంచెం ఎబ్బేట్టుగా ఉంటుంది. అలా చాలా పాటలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు.

Mr. Bachchan

- Advertisement -

ఇకపోతే సినిమా టాకీ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత, ఆ పాట మొదటి రోజు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. షూటింగ్ మొదటి రోజే అటువంటి స్టెప్ వద్దు అని చెబితే ఆయన ఫీల్ అవుతారు అని నేను కూడా ఏమీ అనకుండా కంటిన్యూ చేసేసాను అంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. ఆ పాటను మిక్కీ కంపోజ్ చేసిన విధానం, అలానే సాహిత్యం కూడా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తానికి హరీష్ ట్రోలింగ్స్ గురించి కూడా స్పందించాడు. మిక్స్డ్ టాక్ అన్ని సినిమాలకు వస్తుంది ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు